Amala Paul : ట్విన్స్‌కు జన్మనివ్వబోతున్న అమలాపాల్.. మైండ్ బ్లోయింగ్ పిక్స్ వైరల్..!

by Anjali |   ( Updated:2024-03-21 05:39:53.0  )
Amala Paul :  ట్విన్స్‌కు జన్మనివ్వబోతున్న అమలాపాల్.. మైండ్ బ్లోయింగ్ పిక్స్ వైరల్..!
X

దిశ, సినిమా: హీరోయిన్ అమలాపాల్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోనవసరం లేదు. మలయాళీ ముద్దుగుమ్మ అయిన తెలుగు హీరోల సరసన నటించి తెలుగు ప్రేక్షకుల గుండెల్లో నిలిచిపోయింది. మెగా పవర్ స్టార్ చరణ్, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సరసన నటించి.. టాలీవుడ్ లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది. ఇకపోతే ఈ డస్కీ బ్యూటీ గతేడాది జగత్ దేశాయ్ అనే వ్యక్తిని రెండో వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. నవంబరు 5 వ తారీకున అతడితో కలిసి ఏడడుగుల బంధంలోకి అడుగుపెట్టింది.

పెళ్లై రెండు నెలలు గడవక ముందే ప్రెగ్రెన్సీ అని ప్రకటించి, అభిమానులకు ఒక్కసారిగా షాక్ ఇచ్చింది. అమలాపాల్ ప్రెగ్నెంట్ అయినప్పటి నుంచి పలు వెకేషన్స్ లో ఎంజాయ్ చేస్తూ.. తన బేబీ బంప్ పిక్స్ సోషల్ మీడియాలో ఫ్యాన్స్ తో పంచుకుంటోంది. ఇకపోతే తాజాగా అమల అమల పెట్టిన పోస్ట్ సోషల్ మీడియాలోని జనాల్లో ఆసక్తి రేకెత్తిస్తోంది. ఓ క్యూట్ బేబీని తన ఒళ్లో కూర్చోబెట్టుకుని.. అమల ‘2 హ్యాపీ కిడ్స్’ అని క్యాప్షన్ రాసుకొచ్చింది. ఈ పోస్ట్ కాస్త నెట్టింట వైరల్ అవ్వడంతో అమలపాల్‌కు కవలలు జన్మించబోతున్నారు, ఈ విధంగా ఫ్యాన్స్ కు హింట్ ఇచ్చిందంటూ అమలాపాల్ కు కంగ్రాట్స్ చెబుతూ హ్యాపీ కామెంట్స్ పెడుతున్నారు.

Advertisement

Next Story