హేటర్స్‌ను ఎప్పుడూ నిరాశ పరుస్తూనే ఉంటా.. అనసూయ వరుస ట్వీట్స్

by Hamsa |   ( Updated:2023-08-21 05:10:46.0  )
హేటర్స్‌ను ఎప్పుడూ నిరాశ పరుస్తూనే ఉంటా.. అనసూయ వరుస ట్వీట్స్
X

దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ హాట్ యాంకర్ అనసూయ సోషల్ మీడియాలో నిత్యం హాట్ టాపిక్ గా నిలుస్తుంటుంది. పలు విషయాల్లో నెటిజెన్స్ నుంచి భారీ ట్రోలింగ్ ని ఎదురుకుంటుంది. ఇక ఇటీవల ఏడుస్తున్న వీడియోను షేర్ చేసి సంచలనం సృష్టించింది. తర్వాత మళ్లీ ఎందుకు ఏడ్చిందో క్లారిటీ ఇచ్చింది. తాజాగా, అనసూయ మరోసారి ట్రోలర్స్‌ను ఉద్దేశిస్తూ వరుస ట్వీట్లు షేర్ చేసింది. ‘‘ఒక వ్యక్తిని తక్కువ చేసి, వాళ్ళు బాధపడుతుంటే మళ్ళీ మీరే సానుభూతి చూపించి, మీకు మీరే మంచి వాళ్లమని ఫీల్ అయిపోవడం. ఒకవేళ ఆ వ్యక్తి మీరు చేసే పనులకు ఎదురుండి నిలబడితే తట్టుకోలేకపోవడం వంటి వైఖరిని కపట ధోరణి అంటారు. మనిషి బ్రతుకున్నంత కాలం చచ్చేలా వేధించి, మరణించాకా సానుభూతి చూపించి అటెన్షన్‌ పొందాలనుకునే మిమ్మల్ని చూస్తుంటే చాలా బాధగా ఉంది. ఏది ఏమైనా ఇప్పటికే నేను విపరీతమైన ద్వేషాన్ని ఎదుర్కొని నిలబడ్డా. ఇక ముందూ నిలబడతా.హేటర్స్‌ను ఎప్పుడూ నిరాశపరుస్తూనే ఉంటా. నన్ను అభిమానించే వాళ్లను ఎప్పటికీ ఆరాధిస్తూనే ఉంటా. మీరే నా బలం, శక్తి’’ అంటూ రాసుకొచ్చింది. అలాగే మరో పోస్టులో ‘‘అసలు మనం ట్విటర్‌, ఇన్‌స్టాగ్రామ్‌ వంటి సోషల్ మీడియాలో ఉండటానికి కారణం అటెన్షన్‌ పొందడం కోసం కాదా?’ అంటూ ప్రశ్నించింది.

Advertisement

Next Story