పెళ్లికి ముందే ఆ హీరోయిన్‌ను ప్రేమించిన అల్లుఅర్జున్?

by Hamsa |   ( Updated:2023-04-08 11:05:11.0  )
పెళ్లికి ముందే ఆ హీరోయిన్‌ను ప్రేమించిన అల్లుఅర్జున్?
X

దిశ, వెబ్ డెస్క్: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పని లేదు. స్టార్ కమెడియన్ అల్లు రామలింగయ్య మనవడిగా ఇండస్ట్రీకి పరిచయం అయ్యాడు. ఆ తర్వాత తన డ్యాన్స్, నటనతో ఫుల్ ఫాలోయింగ్‌ను సంపాదించుకున్నాడు. 2021లో విడుదలైన ‘పుష్ప’ సినిమాతో దేశవ్యాప్తంగా ఫుల్ పాపులారిటీ వచ్చింది. అల్లు అర్జున్ ప్రస్తుతం ‘పుష్ప-2’ షూటింగ్ బిజీగా ఉన్నాడు. అల్లు అర్జున్ స్నేహారెడ్డిని పెళ్లి చేసుకుని ఇద్దరు పిల్లలకు కూడా తల్లిదండ్రులు అయిన విషయం తెలిసిందే. అయితే పెళ్లికి ముందు అల్లు అర్జున్ ఓ హీరోయిన్‌ను గాఢంగా ప్రేమించాడట. ఆ హీరోయిన్ మరెవరో కాదు ఐశ్వర్యరాయ్. బన్నీకి ఐశ్వర్య అంటే విపరీతమైన అభిమానం ఉందట. అంతేకాకుండా ఆమె పెళ్లి జరిగినప్పుడు అల్లు అర్జున్ చాలా బాధపడినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం అల్లు అర్జున్‌కు సంబంధించిన వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

ఇవి కూడా చదవండి: హనీ రోజ్ హాట్ హాట్ ఫోజులు.. యువత హృదయాలు గల్లంతు..!

Advertisement

Next Story