- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
Allu Sirish : అల్లు శిరీష్ సినిమా అప్‌డేట్.. అదిరిపోయిన కొత్త పోస్టర్

దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ యంగ్ హీరో అల్లు శిరీష్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. వినూత్న కథలను ఎంచుకుంటూ ప్రేక్షకులను మెప్పిస్తున్నప్పటికీ.. ఇండస్ట్రీ హిట్ ఒక్కటి కూడా కొట్టలేకపోయాడు. దీంతో ఎంతటి బ్యాక్‌గ్రౌండ్ ఉన్నప్పటికీ కాలం కలిసిరావాలని కొందరు విమర్శిస్తుంటారు. అయితే.. శిరీష్ గతేడాది ‘ఊర్వశివో.. రాక్షసివే’ సినిమా తర్వాత.. ఇంత వరకు మరో మూవీ ఒప్పుకోలేదు శిరీష్.
ఇక తాజాగా కొత్త కాన్సెప్ట్‌లో తెరకెక్కుతోన్న సినిమా గురించి శిరీష్ అప్‌డేట్ ఇచ్చారు. ఈ సినిమా ప్రీ లుక్ పోస్టర్‌ను విడుదల చేస్తూ..‘‘నా తర్వాత సినిమా నుండి నేను & నా సహనటుడు. ఆశ్చర్యంగా ఉందా? మే 30 సాయంత్రం 4:05 గంటలకు నా తదుపరి చిత్రం ఫస్ట్ లుక్ & గ్లింప్స్ వీడియో విడుదల చేస్తాము. కాబట్టి వేచి ఉండండి!’’ అంటూ పోస్ట్ పెట్టాడు. మరి ఈ సినిమాతో అయినా శిరీష్ హిట్ కొడతాడేమో వేచి చూడాల్సి ఉంది.
ఇవి కూడా చదవండి:
లావణ్య త్రిపాఠి అందుకోసమే మెగా హీరో వరుణ్‌ను పట్టుకుందా..?