నా ఏజ్ వాళ్లంతా అలా.. కానీ నేనేమో ఇలా.. ఆ విషయంలో ఫీల్ అవుతున్న అల్లు శిరీష్..!

by Hamsa |   ( Updated:2023-11-22 05:06:49.0  )
నా ఏజ్ వాళ్లంతా అలా.. కానీ నేనేమో ఇలా.. ఆ విషయంలో ఫీల్ అవుతున్న అల్లు శిరీష్..!
X

దిశ, వెబ్‌డెస్క్: అల్లు అరవింద్ కుమారుడిగా అల్లు శిరీష్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చాడు. గౌరవం సినిమాతో హీరోగా పరిచయం అయ్యాడు. ఆ తర్వాత పలు చిత్రాల్లో నటించినప్పటికీ ప్రేక్షకులను మెప్పించలేక పోయాడు. ఈ క్రమంలోనే ఇండస్ట్రీలో స్టార్ హీరోగా నిలదొక్కుకోవడం కోసం అల్లు శిరీష్ ప్రయత్నాలు చేస్తున్నారు. ఇలా ఆయన ఇండస్ట్రీలో పలు సినిమాల్లో నటిస్తూ ప్రేక్షకుల ముందుకు వస్తున్నప్పటికీ స్టార్ డమ్ సాధ్యం కాలేదు. అయితే శిరీష్ సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉంటూ పలు పోస్టులతో వార్తల్లో నిలుస్తున్నాడు.

తాజాగా, శిరీష్ తన ఇన్‌స్టా స్టోరీలో ఓ ఇంట్రెస్టింగ్ పోస్ట్ షేర్ చేశాడు. ఇందులో భాగంగా తన ఏజ్ తో పాటు ఉన్నటువంటి వారందరూ కూడా అమ్మాయిలతో ఎంచక్కా తిరుగుతూ సంతోషంగా ఉండగా నేను మాత్రం ఇలా జిమ్ లో ఐదు కేజీల డంబెల్ ఎత్తుకుని వర్కౌట్లు చేస్తున్నాను అన్నట్టుగా ఓ రీల్ ఉంది. ఈ రిల్ తన ఇంస్టాగ్రామ్ ద్వారా పోస్ట్ చేస్తూ .. తన జీవితం కూడా ఇప్పుడు అలాగే ఉందంటూ ఏడుస్తున్న ఎమోజీలను షేర్ చేశాడు అల్లు శిరీష్. దీంతో అది చూసిన నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. ప్రస్తుతం శిరీష్ పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారింది.



Advertisement

Next Story