Allu Arjun: క్రేజీ కాంబో పై ఎందుకు అన్ని డౌట్స్ వస్తున్నాయి?

by Prasanna |   ( Updated:2023-03-05 09:53:01.0  )
Allu Arjun: క్రేజీ కాంబో పై ఎందుకు అన్ని డౌట్స్ వస్తున్నాయి?
X

దిశ,వెబ్ డెస్క్ : పుష్ప 2 తరువాత ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నెక్స్ట్ ప్రాజెక్ట్ ఏంటి అనే ప్రశ్నకు చెక్ పెట్టేశారు. అర్జున్ రెడ్డి దర్శకుడు సందీప్ రెడ్డి వంగా టీ సిరీస్లో నిర్మాణంలో భాగంగా భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ బన్ని అనౌన్స్ చేసాడు. అయితే ఈ క్రేజీ కాంబో అలా సెట్ అయ్యిందో ? లేదో ? సోషల్ మీడియాలో ఎన్నో డౌట్స్ వస్తున్నాయి. సందీప్ రెడ్డి , బన్ని మధ్యలో త్రివిక్రమ్ ప్రాజెక్ట్ ఉందనే టాక్ గట్టి గానే వినిపిస్తుంది. అలాగే సురేందర్ రెడ్డితోను ఒక సినిమా ఉంటుందని అంటున్నారు. కానీ సందీప్ రెడ్డి ప్రాజెక్ట్ అధికారికంగా ప్రకటించారు కాబట్టి ఏ ప్రాజెక్ట్ ముందు సెట్స్ పైకి వెళ్తుందనేది చెప్పలేము.

ఇంకో డౌట్ ఏంటంటే ఈ కథ ముందు మహేష్ కు వినిపించారట.. కథ నచ్చక రిజెక్ట్ చేసారని.. ఆ తరువాత బన్ని దగ్గరకి వచ్చిందట. ముందుగా మహేష్ తో సినిమా చేయాలనుకున్నాడట. కానీ మహేష్ నో చెప్పాడట. అదే కథను బన్నికి ఒకే చేసారని టాలీవుడ్ వర్గాల నుంచి సమాచారం. సందీప్ రెడ్డి ప్రస్తుతం యానిమల్ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమా తేడా జరిగితే బన్ని సినిమా ఉంటుందా ? లేదన్నది పెద్ద డౌట్. ఈ విధంగా వీళ్ల కాంబో పై ఎన్నో డౌట్స్ వస్తున్నాయి.

ఇవి కూడా చదవండి :

Allu Arjun: బన్నీ-త్రివిక్రమ్ న్యూ ప్రాజెక్టుకు రంగం సిద్ధం?

Ram Chran: RC15 నుంచి అదిరిపోయే అప్డేట్.. అభిమానులకు పండగే.. పండుగ!

Advertisement

Next Story