పవన్ కల్యాణ్‌కు మద్దతు ప్రకటించిన అల్లు అర్జున్.. ఫుల్ జోష్‌లో మెగా ఫ్యాన్స్

by Anjali |   ( Updated:2024-05-09 14:45:37.0  )
పవన్ కల్యాణ్‌కు మద్దతు ప్రకటించిన అల్లు అర్జున్.. ఫుల్ జోష్‌లో మెగా ఫ్యాన్స్
X

దిశ, వెబ్‌డెస్క్: ఎన్నికలకు మరో మూడు రోజులు మాత్రమే మిగిలి ఉంది. దీంతో అభ్యర్థులు చివరి ప్రయత్నాలు ప్రారంభించారు. ఓటర్లను తమవైపు తిప్పుకునేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. ముఖ్యంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ పోటీ చేస్తోన్న పిఠాపురం నియోజకవర్గంలో అటు ఇండస్ట్రీకి చెందిన వారు, ఇటు అభిమానులు విస్తృతంగా పర్యటిస్తూ పవన్ కల్యాణ్ గెలుపునకు ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే ఇండస్ట్రీ నుంచి, మెగా ఫ్యామిలీ నుంచి అనేకమంది ప్రచారం నిర్వహించారు. వరుణ్ తేజ్, సాయితేజ్, వైష్ణవ్ తేజ్‌తో పాటు జబర్దస్త్ నటీనటులంతా గతకొన్ని రోజులుగా పనిమానుకొని మరీ పవన్ కల్యాణ్ కోసం ప్రచారం నిర్వహించారు. మెగాస్టార్ చిరంజీవి, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ కూడా సోషల్ మీడియా వేదికగా పవన్‌ను గెలిపించాలని ఓటర్లను కోరారు. ఇదిలా ఉండగా.. పవన్ కల్యాణ్‌కు మరో టాలీవుడ్ అగ్ర హీరో మద్దతు ప్రకటించారు. ఇన్‌స్టాగ్రామ్ వేదికగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పవన్ కల్యాణ్‌ను గెలిపించాలని కోరారు. ప్రజల కోసం మంచి లైఫ్‌ను త్యాగం చేసి మరీ పోరాడుతున్న ఆయనకు ఒక అవకాశం ఇవ్వాలని అడిగారు. దీంతో ఇన్నాళ్లు మెగా, అల్లు కుటుంబాల మధ్య విభేదాలు వచ్చాయన్న వార్తలను చెక్ చెప్పినట్లు అయింది. బన్నీ విషెస్ చెప్పండంతో అటు మెగా ఫ్యాన్స్, ఇటు అల్లు ఫ్యాన్స్ సంబురాలు చేసుకుంటున్నారు.

Read More..

పవన్ కళ్యాణ్‌కు బిగ్ రిలీఫ్..ఎట్టకేలకు పచ్చజెండా ఊపిన అధికారులు!

Advertisement

Next Story