- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Allu Arjun: నెట్టింట దుమారం రేపుతోన్న అల్లు అర్జున్ లవ్ ఎఫైర్ వ్యవహారం.. ఆమెవరో తెలిస్తే షాక్?
దిశ, సినిమా: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ వారసుడిగా టాలీవుడ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి అతి తక్కువ సమయంలోనే స్టార్ గుర్తింపు దక్కించుకున్నాడు. ఈ హీరో డాన్స్ గురించైతే స్పెషల్ గా చెప్పనవసరం లేదు. గంగోత్రి సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చి.. తర్వాత ‘ఆర్య, బన్ని, హ్యాపీ, దేశముదురు, పరుగు, శంకర్ దాదా జిందాబాద్(అతిథి పాత్రలో), ఆర్య-2, వరుడు, వేదం, బద్రీనాధ్, ఇద్దరమ్మాయిలతో, రుద్రమదేవి, సరైనోడు, రేసుగుర్రం, సన్నాఫ్ సత్యమూర్తి, డీజే(దువ్వాడ జగన్నాధం), నా పేరు సూర్య ఇల్లు ఇండియా, అల వైకుంఠపురంలో, పుష్ప వంటి బ్లాక్ బస్టర్ చిత్రాల్లో నటించి తెలుగు ప్రేక్షకుల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్నాడు. ప్రస్తుతం పుష్పకు సీక్వెల్ గా వస్తోన్న పుష్ప-2 లో నటిస్తున్నారు. పార్ట్-1 లో ఏకంగా ఈ హీరోకు ఉత్తమ జాతీయ అవార్డు రావడం విశేషం.
ఇకపోతే సినీ సెలబ్రిటీలపై లవ్ ఎఫైర్స్ అంటూ నెట్టింట వార్తలు రావడం కామన్. తాజాగా ఐకాన్ స్టార్ కూడా ఓ హీరోయిన్‌తో లవ్ లో ఉన్నాడంటూ సోషల్ మీడియాలో టాక్ నడుస్తోంది. మరీ ఆ హీరోయిన్ ఎవరో కాదు.. యు ఆర్ మై ఎమ్మెల్యే అంటూ ఐకాన్ స్టార్ ఓ మూవీలో పడగొట్టిన హీరోయిన్ కేథరిన్. అయితే వరుసగా అల్లు అర్జున్ అండ్ కేథరిన్ సరైనోడు, రుద్రమదేవి, ఇద్దరమ్మాయిలతో వంటి సినిమాల్లో నటించారు. వరుస మూవీల్లో కలిసి నటించడంతో టాలీవుడ్ పరిశ్రమలో వీరిద్దరి మధ్య ఎఫైర్ నడుస్తోందని గుసగుసలు వినిపించాయి. దీనిపై బన్ని సన్నిహితులు స్పందించి.. అవకాశాలు అనేది దర్శక, నిర్మాతలు ఇస్తారని, ఇద్దరి మధ్య ఉంది కేవలం స్నేహం మాత్రమేనని ఈ రూమర్స్ కొట్టిపారేశారు. ప్రస్తుతం ఈ వార్త నెట్టింట తెగ వైరల్ అవుతోంది.
Read More..