Allu Arjun : నా సినిమాలో నటించకుంటే చంపేస్తా.. ‘పుష్ప’ నటుడికి అల్లు అర్జున్ వార్నింగ్

by Hamsa |   ( Updated:2023-05-30 14:37:50.0  )
Allu Arjun : నా సినిమాలో నటించకుంటే చంపేస్తా.. ‘పుష్ప’ నటుడికి అల్లు అర్జున్ వార్నింగ్
X

దిశ, వెబ్ డెస్క్: టాలీవుడ్ స్టార్ హీరో అల్లు అర్జున్ ‘పుష్ప’ సినిమా ప్రపంచ వ్యాప్తంగా ఎంత హిట్ అయ్యిందో అందరికీ తెలిసిందే. ఇందులోని హీరో ఫ్రెండ్‌గా నటించిన నటుడు జగదీశ్ ప్రతాప్ బండారికి చాలా ఫేమ్ తెచ్చిపెట్టింది. అయితే జగదీష్ ఇటీవల ‘సత్తి గాని రెండెకరాలు’ సినిమాలో హీరోగా నటించిన విషయం తెలిసిందే. తాజాగా, అల్లు అర్జున్, జగదీష్‌కు తన సినిమాలో నటించక పోతే చంపేస్తామని వార్నింగ్ ఇచ్చారు. ఇండియన్ ఐడల్-2 ఫినాలేకు బన్నీ గెస్ట్‌గా వచ్చిన సంగతి తెలిసిందే. ఈ ప్రోగ్రాంకు జగదీష్ కూడా ‘సత్తి గాని రెండెకరాలు’ ప్రమోషన్స్‌లో భాగంగా హాజరయ్యాడు. ఈ క్రమంలో పుష్ప అన్నా నాకో రెండు ఎకరాలు ఉన్నాయి కొంటారో లేదోనని వచ్చుండా అంటూ అల్లు అర్జున్‌ను అంటాడు.

Also Read: దటీజ్ సాయి పల్లవి.. మిగతా హీరోయిన్స్‌కి ఈమెకి ఉన్న తేడా అదే!

దీనికి బన్నీ తప్పకుండా చేస్తాను గానీ.. చూసిందా చూడలేదా అని ఫన్నీగా అడుగుతాడు. అయితే ఈ సందర్భంగా జగదీష్‌తో కాసేపు సరదాగా మాట్లాడుతాడు అల్లు అర్జున్. ఈ క్రమంలో నువ్వు గుర్తు పెట్టుకో నువ్వు సత్తివి కాదు.. కేశవే. త్వరగా సినిమా ప్రమోషన్ ముగించుకుని అక్కడ షూటింగ్‌కు రమ్మని చెబుతాడు. అంతేకాకుండా అందరూ వెయిట్ చేస్తున్నారు. ఇప్పుడు హీరోగా సినిమా చేశానని, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా చేయనని ఓవరాక్షన్ ఏం చేయవు కదా అని అంటాడు. హీరోగా మూవీ సక్సెస్ అయిందని నా సినిమాలో క్యారెక్టర్ చేయనని చెబితే చంపేస్తానని స్వీట్‌గా వార్నింగ్ ఇస్తాడు అల్లు అర్జున్. ప్రస్తుతం ఈ షోకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Advertisement

Next Story