- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Allu Arjun: పుష్ప2 సినిమా తరువాత అల్లు అర్జున్ ఏ డైరెక్టర్‌కు అవకాశం ఇస్తారో తెలుసా ?
దిశ, వెబ్ డెస్క్ : టాలీవుడ్లో ఇప్పుడంతా పాన్ ఇండియా ట్రెండ్ నడుస్తుంది. ఒక్కసారిగా నేషనల్ వైజ్ గా స్టార్ డమ్ వస్తే ఆ క్రేజ్ ను ఎట్టి పరిస్థితుల్లోని వదులుకోకూడదని ఫిక్స్ అయ్యారు బడా స్టార్స్. వాళ్ల రేంజ్‌కు తగ్గ దర్శకులను ముందే సెలెక్ట్ చేసుకుంటున్నారు. అయితే ఈ విషయంలో దర్శకుల కొరతను ఎదుర్కొంటున్నారు. ఒక స్టార్ హీరో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఫోకస్ అంతా ఇప్పుడు పుష్ప2 పైనే ఉంది. పాన్ ఇండియా రేంజులో వచ్చిన ఇమేజ్‌ను ఎట్టి పరిస్థితుల్లో చెయ్యి జారకూడదని డిసైడ్ అయ్యాడు. పుష్ప 2 కథ విషయంలో అల్లు అర్జున్ చాలా జాగ్రత్తలు తీసుకున్నారట. నార్త్ లో బ్లాక్ బస్టర్ కావటమే పుష్ప సినిమా పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. దానికి తగ్గట్టే షూటింగ్ శర వేగంగా జరుగుతుంది.
పుష్ప2 తరువాత అల్లు అర్జున్ ఏ డైరెక్టర్‌కు అవకాశం ఇస్తారో వేచి చూడాలి. ఎందుకంటే తన రేంజుకు తగ్గ స్టార్ట్ డైరెక్టర్స్ ఎవరు ఖాళీగా లేరు. ప్రశాంత్ నీల్ సలార్ తరువాత తారక్, రామ్ చరణ్ లతో ఫిక్స్ చేసుకున్నారు. సందీప్ రెడ్డి వంగా రెండేళ్ళు స్పిరిట్ కోసం వర్క్ చేయనున్నారు. సుకుమార్‌తో మళ్ళీ రిపీట్ చేసి పరిస్థితి లేదు. శంకర్‌తో చేద్దామంటే అంటే ఇండియన్2, RC 15 తరువాత రణవీర్ సింగ్ ప్రొజెక్ట్ ఫైనల్ అయింది. రాజమౌళితో చేయాలంటే ఇంకో 3 ఏళ్ళ వరకు వెయిట్ చేయాలి. ఇలా ఎన్ని అప్షన్స్ చూసినా ఏది అనుకూలంగా లేకపోవటంతో ఐకాన్ స్టార్ ఫోకస్ బాలీవుడ్ మేకర్స్ పై పడినట్టు ప్రచారం ఊపు అందుకుంది. మొత్తానికి పుష్ప2 పోస్ట్ ప్రొడక్షన్ కి వెళ్లేలోపు బన్నీ నెక్ట్స్ ప్రాజెక్టును లాంచ్ చేసుకోవాలి. లేదంటే గ్యాప్ వచ్చేస్తుంది.