Power Star Pawan Kalyan : పవన్ కోసం బన్నీ ప్రచారం? ‘పుష్ప-2’ పూర్తవగానే బరిలోకి?

by Anjali |   ( Updated:2023-08-13 13:50:08.0  )
Power Star Pawan Kalyan : పవన్ కోసం బన్నీ ప్రచారం? ‘పుష్ప-2’ పూర్తవగానే బరిలోకి?
X

దిశ, సినిమా: పవన్ కల్యాణ్ జనసేన పార్టీ పెట్టినప్పటి నుంచి మెగా ఫ్యామిలీలో చిరంజీవి దగ్గర్నుంచి వైష్ణవ్ తేజ్ వరకు ఎవరూ పెద్దగా సపోర్ట్ చేయలేదు. గత ఎన్నికల ప్రచారంలో అల్లు అర్జున్, వరుణ్ తేజ్ ఒకటి రెండు సభల్లో ప్రాల్గొన్నా పెద్దగా ప్రభావం చూపలేదు. మెగా హీరోల్లో అందరూ కాకపోయినా కొందరైనా టైమ్ ఇచ్చి ప్రచారం చేసుంటే.. జనసేనకు ఈ తరహా ఓటమి చవిచూసేవారు కాదని ఫలితాల తర్వాత అభిమానులు, రాజకీయ విశ్లేషకులు నెట్టింట విస్తృతంగా చర్చించుకున్నారు. ముఖ్యంగా మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్, అల్లు అర్జున్ పూర్తి స్థాయిలో ప్రచారంలో పాల్గొని ఉంటే పరిస్థితి వేరేలా ఉండేదని అభిప్రాయాలు వ్యక్తం చేశారు.

అయితే రాబోయే ఎన్నికల్లో ఈ తప్పు చేయకూడదని పార్టీ అధ్యక్షుడు పవన్ భావించారట. అందుకే ముందుగానే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌ను సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. వచ్చే ఎన్నికల్లో పార్టీ తరపున ప్రచారం చేయాలని అల్లు అర్జున్‌కు పవన్ సూచించినట్లు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. అంతేకాదు బన్నీ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సివుంది. ఇదే కనుక నిజమైతే వచ్చే ఎన్నికల్లో ‘పుష్ప’ ప్రభావం బాగానే ఉంటుందని జనసైనికులు భావిస్తున్నారు.

Advertisement

Next Story