అల్లు అరవింద్ నా జీవితంలో పెద్ద శత్రువు.. దగ్గుబాటి రానా షాకింగ్ కామెంట్స్

by Hamsa |   ( Updated:2023-09-23 04:47:45.0  )
అల్లు అరవింద్ నా జీవితంలో పెద్ద శత్రువు.. దగ్గుబాటి రానా షాకింగ్ కామెంట్స్
X

దిశ, వెబ్‌డెస్క్: దగ్గుబాటి రానా ‘లీడర్’ సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చాడు. అలా కొన్ని సినిమాలు చేస్తున్న సమయంలో మొదటిసారి బాహుబలి సినిమాలో ప్రభాస్ కి విలన్ గా నటించి సంచలనం సృష్టించారు. అంతేకాకుండా నిర్మాతగా హీరోగా, విలన్ క్యారెక్టర్లు చేస్తూ అభిమానులను అలరిస్తున్నాడు. ఇటీవల రానా నాయుడు వెబ్‌సిరీస్‌లో బోల్డ్‌గా నటించి రెచ్చిపోయారు.

తాజాగా, రానా ఓ ఇంటర్వ్యూలో పాల్గొని అల్లు అరవింద్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. రానా, రామ్ చరణ్ చిన్నప్పటి నుంచి బెస్ట్ ఫ్రెండ్స్ అన్న విషయం తెలిసిందే. అయితే ఏదైనా తప్పు పని చేసి రామ్ చరణ్ చిరంజీవి దగ్గర అడ్డంగా బుక్ అయితే అదే సమయంలో రానా కూడా తన తండ్రి దగ్గర దెబ్బలు తినేవాడట. దానికి ప్రధాన కారణం ఈ విషయం చిరంజీవి అల్లు అరవింద్‌కు చెప్పడంతో వెంటనే ఫోన్ చేసి రానా తండ్రికి చెప్పేవారట. దీంతో రానా ఇంటికి రావడంతో తండ్రితో దెబ్బలు తినేవారట. ఈ కారణంతోనే అల్లు అరవింద్ నా జీవితంలో పెద్ద శత్రువు అంటూ సరదాగా ఓ ఇంటర్వ్యూలో రానా దగ్గుబాటి చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ కామెంట్స్ నెట్టింట వైరల్‌గా మారాయి.

Advertisement

Next Story