పాపం.. నడుము విరిగేలా కిందపడ్డ యంగ్ హీరోయిన్.. (Video)

by Sujitha Rachapalli |
పాపం.. నడుము విరిగేలా కిందపడ్డ యంగ్ హీరోయిన్.. (Video)
X

దిశ, సినిమా: యంగ్ బ్యూటీ అలయా ఫర్నిచర్ వాలా విభిన్నమైన పాత్రలు ఎంచుకుంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ప్రతి విషయాన్ని ఓపెన్ గా మాట్లాడే అమ్మడు.. ముక్కు సర్జరీ విషయాన్ని కూడా బహిరంగంగా చర్చించింది. తన నోస్ సరిగ్గా లేదని.. సర్జరీ చేయించుకోమని సలహా ఇచ్చారని తెలిపింది. ట్రోలర్స్ ను అసలు పట్టించుకోనని.. నెగెటివ్ కామెంట్స్ పై మాట్లాడింది. ఇక ఇదంతా పక్కన పెడితే ఫిట్ నెస్ ఫ్రీక్ అయిన అలయ.. జిమ్ లో వ్యాయామం చేస్తున్న ఫొటోలు, వీడియోలు తరుచుగా షేర్ చేస్తుంటుంది. ఈ క్రమంలోనే ఓ వీడియో పంచుకున్న ఆమె.. ఇందులో వర్క్ అవుట్ చేస్తుండగా మిస్ అయిపోయి నడుము విరిగేలా కింద పడిపోయింది. అయినా సరే నవ్వుతూ లేచి మళ్లీ కంటిన్యూ చేసింది.

కాగా దీనిపై స్పందిస్తున్న నెటిజన్లు.. ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు. గుక్క పెట్టి ఏడుస్తుంది అనుకున్నాం కానీ చాలా పాజిటివ్ గా రియాక్ట్ అయిందని అంటున్నారు. ఈమె ఏంటి ఇంత తెలివి తక్కువ పనులు చేస్తుంది.. బాల్ మీద అలా దూకితే ఎవరైనా పడిపోతారు కదా.. మినిమమ్ కామన్ సెన్స్ అంటున్నారు.


Advertisement

Next Story

Most Viewed