Alanati Ramachandradu: ‘అలనాటి రామచంద్రుడు’ ట్రైలర్‌ రిలీజ్.. ఆకట్టుకుంటున్న డ్రామా, ఎమోషనల్ వీడియో

by sudharani |   ( Updated:2024-07-27 14:44:53.0  )
Alanati Ramachandradu: ‘అలనాటి రామచంద్రుడు’ ట్రైలర్‌ రిలీజ్.. ఆకట్టుకుంటున్న డ్రామా, ఎమోషనల్ వీడియో
X

దిశ, సినిమా: యంగ్ నటుడు కృష్ణ వంశీ, మోక్ష లీడ్ రోల్స్‌లో నటిస్తున్న లవ్ ఎంటర్ టైనర్ ‘అలనాటి రామచంద్రుడు’. హైనివా క్రియేషన్స్ బ్యానర్‌పై హైమావతి, శ్రీరామ్ జడపోలు నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని చిలుకూరి ఆకాష్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నాడు. మూవీ ప్రమోషనల్ కంటెంట్‌కి మంచి రెస్పాన్స్ రాగా.. తాజాగా మేకర్స్ థియేట్రికల్ ట్రైలర్‌ను విడుదల చేశారు.

ఇక కథ విషయానికి వస్తే.. ‘ఇది ఒక అమ్మాయిని గాఢంగా ప్రేమించే నిజాయితీ గల యువకుడి కథ. తను ఆమెతో గడిపిన ప్రతి క్షణాన్ని ఎంజాయ్ చేస్తాడు. తన ఫ్రెండ్స్, చుట్టుపక్కలవారు అందరూ కూడా తన ప్రేమను అమ్మాయికి చెప్పమని బలవంతం చేస్తారు. కానీ ఆమె నో చెబితే ఏమౌతుందో చెప్పడానికి భయపడతాడు. అయితే వీరి మధ్య కొన్ని అనుకోని సంఘటనలు చోటుచేసుకుంటాయి’ చివరికి అబ్బాయి లవ్ అమ్మాయికి తెలిసిందా..? వీరిద్దరూ ఎలా ఒక్కటయ్యారు? అనేది స్టోరీ. కథలోని డ్రామా, ఎమోషనల్ రిచ్‌నెస్‌ని ట్రైలర్ అద్భుతంగా క్యాప్చర్ చేసింది. ఆగస్టు 2న విడుదలకు సిద్ధంగా ఉన్న ఈ సినిమాపై ట్రైలర్ అంచనాలను మరింత పెంచేసింది.

Read more...

Nandamuri Mokshagna: ఇంట్రడక్షన్ సీన్, స్టోరీ అంచనాలకు మించి ఉంటుంది.. మోక్షజ్ఞ ఆసక్తికర పోస్ట్

Advertisement

Next Story

Most Viewed