ఎట్టకేలకు భారతీయ పౌరసత్వాన్ని పొందిన బాలీవుడ్ హీరో.. పోస్ట్ వైరల్

by samatah |
ఎట్టకేలకు భారతీయ పౌరసత్వాన్ని పొందిన బాలీవుడ్ హీరో.. పోస్ట్ వైరల్
X

దిశ, సినిమా : బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్‌ తన అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పాడు. ఎట్టకేలకు ఆయన భారతీయ పౌరసత్వాన్ని తిరిగి పొందినట్లు సోషల్ మీడియా వేదికగా ప్రకటించాడు. ‘నా హృదయం.. నా పౌరసత్వం రెండూ హిందుస్థానే. స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు. జై హింద్’ అంటూ ఇందుకు సంబంధించిన అధికారిక పత్రాలను నెట్టింట షేర్ చేశాడు. అలాగే అక్షయ్ హరిఓం భాటియా పేరు మీద భారతీయ పౌరసత్వం మంజూరైందని, తండ్రి బ్రిజ్ మోహన్ భాటియా, తల్లి అరుణా భాటియా, భార్య డింపుల్ ఖన్నా పేర్లతో ఈ సిటిజన్‌షిప్ సర్టిఫికెట్ ఆఫ్ రిజిస్ట్రేషన్ అయినట్లు అక్షయ్ తెలిపాడు. దీంతో తన అభిమానులు పెద్ద ఎత్తున శుభాకాంక్షలు చెబుతున్నారు. ఇక 20 ఏళ్ల క్రితం సినిమా అవకాశాలు లేకపోవడం, వ్యక్తిగత కారణాలతో కెనడాలో స్థిరపడాలనే ఉద్ధేశంతో ఆ దేశ పాస్ పోర్ట్ కోసం అప్లై చేసేందుకు భారత పౌరసత్వాన్ని వదులుకున్న అక్షయ్.. కెనడా ప్రభుత్వం అందించిన పాస్‌పోర్ట్‌తోనే ఇంతకాలం భారత్‌లో నివసిస్తున్నాడు. కొద్దిరోజుల కిందటే తన కెనడా పాస్‌పోర్ట్‌ను రెన్యూవల్ చేయించుకోవడంతో పెద్ద ఎత్తున విమర్శలు కూడా ఎదుర్కొన్నాడు.

Advertisement

Next Story

Most Viewed