- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Shobhitha Dhulipala: ఓ బడా గ్యాంగ్‌స్టర్‌కు భార్యగా అక్కినేని కోడలు.. ఓటీటీలో అదరగొడుతున్న బోల్డ్ మూవీ..స్ట్రీమింగ్ ఎక్కడంటే
దిశ, సినిమా: ప్రజెంట్ సోషల్ మీడియాలో హాట్ హాట్‌గా నడుస్తున్న మ్యాటర్ ఏదైనా ఉన్నదంటే అది నాగచైతన్య శోభిత ధూళిపాళ ఎంగేజ్‌మెంట్ న్యూసే. సమంతతో విడాకుల తర్వాత చైతన్య శోభిత డేటింగ్‌లో ఉన్నారని వస్తున్న పుకార్లను నిజం చేస్తూ.. వీరు ఆగస్టు 8న కొంత మంది బంధువుల సమక్షంలో ఆడంబరంగా నిశ్చితార్థం చేసుకున్నారు. ఈ విషయాన్ని స్వయంగా నాగార్జున X వేదికగా ప్రకటించారు. ఇక అప్పటి నుంచి అక్కినేని ఇంటి కోడలు అయిన శోభిత గురించి గూగూల్‌లో తెగ వెతికేస్తున్నారు. ఆ క్రమంలో ఈ బ్యూటీకి సంబంధించిన ఎన్నో విషయాలు బయట పడుతున్నాయి. అందులో భాగంగా ఈ అమ్ముడుకు సంబంధించిన మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ నెట్టింట చక్కర్లు కొడుతుంది.
అచ్చ తెలుగు అమ్మాయి అయిన శోభిత కేవలం తెలుగులోనే కాకుండా మలయాళ, హిందీ వంటి భాషల్లో కూడా సినిమాలు, వెబ్ సిరీస్‌లు చేసింది. అయితే పలు వెబ్ సిరీస్‌లలో శోభిత నటించినప్పటికీ ఓ రెండు సిరీస్‌లలో మాత్రం బో*ల్డ్ లుక్స్‌తో చెమటలు పట్టించింది. మరి ఇప్పటిదాకా శోభిత బోల్డ్ లుక్స్‌తో అదరగొట్టిన ఆ సిరీస్‌లు పేర్లు అలాగే అవి ఏ ఓటీటీలో ఉన్నాయో తెలుసుకుందాం.
మేడ్ ఇన్ హెవెన్
ఈ అమ్మడు ‘మేడ్ ఇన్ హెవెన్’ అనే రొమాంటిక్ డ్రామాతో OTT వెబ్ సిరీస్ ప్రపంచంలోకి లోకి అడుగుపెట్టింది. ఇందులో ఆమె కెరీర్ బెస్ట్ పర్ఫామెన్స్ ఇచ్చి అదరహో అనిపించింది. ఇక ఇందులో శోభిత పేరు తారా ఖన్నా, న్యూ ఢిల్లీలో వెడ్డింగ్ ప్లానర్‌గా పని చేస్తుంది. ఒక మురికి వాడలో పుట్టిన ఆమె.. రిచ్ ఫ్యామిలీలోకి కోడలిగా అడుగు పెడుతుంది. అయితే ఈ సిరీస్‌లో పితృస్వామ్య వ్యవస్థ, భారతీయ వివాహాల వల్ల ఈ తరం యూత్ ఎదుర్కొంటున్న పరిస్థితులను చూపించారు. అలాగే ఇందులో కొన్ని బోల్డ్ సీన్స్ కూడా ఉన్నాయి. ఈ సిరీస్ ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది.
ది నైట్ మేనేజర్
దీనితో పాటే ‘ది నైట్ మేనేజర్’ అనే మరో బోల్డ్ సిరీస్‌లో కూడా ఈ బ్యూటీ హీరోయిన్‌గా నటించింది. ఇందులో ఈమె ఓ బడా గ్యాంగ్ స్టర్‌కు భార్యగా కన్పిస్తుంది. ప్రస్తుతం ఈ సిరీస్ డిస్ని ప్లస్ హాట్ స్టార్‌లో స్ట్రీమింగ్ అవుతున్నది. మరి మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక మీరు కూడా ఈ రెండు సిరీస్‌లను చూసేయండి.
Read More..
శోభిత-నాగ చైతన్య ఎంగేజ్‌మెంట్.. సమంత షాకింగ్ నిర్ణయం.. తనపైనున్న 60% ఆస్తి గురించి లాయర్లతో చర్చలు?