- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
బాలకృష్ణ వ్యాఖ్యలకు నాగ చైతన్య, అఖిల్ స్ట్రాంగ్ కౌంటర్

దిశ, వెబ్‌డెస్క్: వీరసింహారెడ్డి విజయోత్సవ సభలో నందమూరి బాలకృష్ణ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఎస్వీ రంగారావు, అక్కినేని నాగేశ్వరరావుల గురించి షాకింగ్ కామెంట్స్ చేశారు. ఈ తెలుగు చిత్ర పరిశ్రమలో తీవ్ర కలకలం రేపాయి. దీనిపై ఇప్పటికే అనేకమంది స్పందించి బాలకృష్ణ వ్యాఖ్యలను ఖండించారు. తాజాగా.. అక్కినేని యువ హీరోలు నాగచౌతన్య, అఖిల్ బాలయ్య వ్యాఖ్యలపై స్పందించారు. నందమూరి తారకరామారావు, అక్కినేని నాగేశ్వరరావు, ఎస్వీ రంగారావులు తెలుగు కళామతల్లి ముద్దు బిడ్డలని వ్యాఖ్యానించారు. అంత గొప్ప వ్యక్తులను కించపరిచేలా మాట్లాడటం మనం మనల్ని అగౌరపరుచుకోవడమే అని అసహనం వ్యక్తం చేశారు. కాగా, ప్రస్తుతం టాలీవుడ్‌లో అక్కినేని-నందమూరి కుటుంబాల మధ్య కొత్త వివాదం తలెత్తడం చర్చనీయాంశమైంది.
ఇవి కూడా చదవండి : బ్రేకింగ్: బాలకృష్ణ క్షమాపణలు చెప్పాల్సిందే.. TDP, బాలయ్యకు కాపునాడు అల్టీమేటం!