అఖిల్ లేటేస్ట్ లుక్‌కు ఫ్యాన్స్ ఫిదా.. సినిమా కోసమేనా లేకా?

by Jakkula Samataha |
అఖిల్ లేటేస్ట్ లుక్‌కు ఫ్యాన్స్ ఫిదా.. సినిమా కోసమేనా లేకా?
X

దిశ, సినిమా : ఈ మధ్య సినిమాల పరంగా అక్కినేని ఫ్యామిలీ చాలా స్లో అయ్యిందనే వార్తలు ఎక్కువగా వినిపిస్తున్న విషయం తెలిసిదే. నాగచైతన్య, నాగార్జున చేసిన కస్టడీ, ది గోస్ట్ సినిమాలు, అఖిల్ ఏజెంట్ సినిమా బాక్సాఫీస్ వద్ద ఘోర పరాజయం పాలు అయ్యాయి. తర్వాత నాగచైతన్య తండేల్ సినిమాతో హిట్ కొట్టడానికి రెడీ అవుతున్నారు. కానీ ఏజెంట్ తర్వాత అఖిల్ నుంచి ఎలాంటి సమాచారం మాత్రం లేదు.

ఇప్పటి వరకు అఖిల్ చేసిన సినిమాల్లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌ల సినిమా ఒక్కటే హిట్ టాక్ తెచ్చుకుంది. దీంతో ఆయన నెక్ట్స్ ఏ సినిమాతో రాబోతున్నారు అనేదానిపై ఎలాంటి అప్డేట్ లేదు. అయితే అఖిల్ స్మాల్ కన్ఫ్యూజన్‌లో పడ్టట్లు తెలుస్తోంది. తర్వాత ఎలాంటి చిత్రం చేయాలో ఆయనకు అర్థం కావడం లేదని, ప్రేక్షకులకు ఎలాంటి సినిమా చేస్తే నచ్చుతుందో తెలియక మీమాంసలో ఉన్నట్లు సమాచారం. ఈ క్రమంలోనే ఆయన లేటెస్ట్ లుక్ అందరినీ ఆకట్టుకుంటుంది. తాజాగా హైదరాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో అఖిల్ దర్శనం ఇచ్చారు. లాంగ్ హెయిర్, గడ్డంతో సూపర్ స్టైలిష్‌గా ఉన్న అఖిల్‌ను చూసి ఆయన ఫ్యాన్స్ తనకు ఫిదా అయిపోయారు. హాలీవుడ్ రేంజ్‌లో ఆయన గెటప్ ఉంది. దీంతో అఖిల్ తన తదుపరి సినిమా కోసమే అలా రెడీ అయ్యారంటున్నారు తన అభిమానులు. కాగా, తన నెక్ట్స్ సినిమా గురించి ఇప్పటి వరకు ఎలాంటి సమాచారం అయితే లేదు. కాగా, ప్రస్తుతం అఖిల్ బెంగళూరు వెళ్తున్నట్లు సమాచారం.

Advertisement

Next Story

Most Viewed