ఆ హీరో‌ తిండిపెట్టి చంపేస్తాడు.. జాగ్రత్తగా ఉండాలంటున్న Akhil Akkineni

by Hamsa |   ( Updated:2022-09-05 14:24:01.0  )
ఆ హీరో‌ తిండిపెట్టి చంపేస్తాడు.. జాగ్రత్తగా ఉండాలంటున్న Akhil Akkineni
X

దిశ, సినిమా : యంగ్ హీరో అక్కినేని అఖిల్ సహ నటుడు ప్రభాస్‌పై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. శర్వానంద్‌, అక్కినేని అమల ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన చిత్రం 'ఒకే ఒక జీవితం' సెప్టెంబర్‌ 9న విడుదల కానుంది. ఈ సందర్భంగా మూవీ టీమ్ ప్రమోషన్స్‌లో వేగం పెంచేసింది. ఇందులో భాగంగానే తాజాగా అమల, శర్వాలతో కలిసి 'అమ్మ చేతి వంట' పేరుతో ప్రొగ్రామ్ ప్లాన్‌ చేశారు మేకర్స్. కాగా ఈ షోలో అక్కినేని అఖిల్‌ కూడా పాల్గొనడం విశేషం. ఈ క్రమంలో 'ప్రభాస్‌ వెరీ ఫుడీ అంట కదా' అని అమల ఇద్దరు హీరోలను ప్రశ్నించింది.

దానికి మొదట బదులిచ్చిన అఖిల్.. 'అవును ప్రభాస్‌ను కలిసిన సమయంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇక చాలు తినలేను అన్నా కూడా వదిలి పెట్టరు' అంటూ ఫన్నీగా చెప్పుకొచ్చాడు. ఇక మరో పక్క శర్వానంద్‌ మాట్లాడుతూ '30 రకాల డిషెస్‌తో మన ముందుకొచ్చి షాకిస్తాడు' అంటూ తన అనుభవాలను పంచుకున్నాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ప్రోమో వైరల్ అవుతుండగా పూర్తి వీడియో సెప్టెంబరు 5 మధ్యాహ్నం రిలీజ్ చేయనున్నారు.

Also Read : Mahesh Babu: ఒక్కడు రీరిలీజ్ డేట్ క‌న్‌ఫర్మ్.. ఎప్పుడో తెలుసా?

Advertisement

Next Story