- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
దారుణంగా పడిపోయిన అఖిల్ ‘ఏజెంట్’ కలెక్షన్లు!
by Anjali |

X
దిశ, వెబ్‌డెస్క్: అక్కినేని అఖిల్ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకొని నటించిన చిత్రం ఏజెంట్. ఈ సినిమాను స్టైలీష్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి తెరకెక్కించాడు. ఏప్రిల్ ఏప్రిల్ 28న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా అనుకున్న స్థాయిలో రాణించలేదు. పాన్ ఇండియా రేంజ్‌లో విడుదలైన ఈ సినిమాకు విడుదలైన అన్నిచోట్ల నుంచి నెగిటివ్ టాక్ వచ్చింది. దీంతో సినిమా కలెక్షన్లపై భారీ ప్రభావం పడింది. దీంతో మొదటిరోజు కూడా మినిమమ్ ఓపెనింగ్స్‌ను దక్కించుకోలేకపోయింది. తెలుగు రాష్ట్రాల్లో రెండోరోజు కేవలం 67 లక్షలు మాత్రమే కలెక్ట్ చేసింది. మరీ ముఖ్యంగా నైజంలో ఈ మూవీ పరిస్థితి మరీ దారుణంగా ఉంది. అక్కడ రెండోరోజు కేవలం 21 లక్షలు మాత్రమే కలెక్ట్ చేసింది. దాదాపు 80 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ మూవీ టాలీవుడ్‌లోనే బిగ్గెస్ట్ ఫ్లాప్‌గా నిలిచింది.
Next Story