ట్రోలర్స్‌కు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన అఖిల్ సార్థక్.. దమ్ముంటే బిగ్‌బాస్ హౌస్‌లోకి వెళ్లమంటూ (వీడియో)

by Hamsa |   ( Updated:2023-10-10 15:05:49.0  )
ట్రోలర్స్‌కు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన అఖిల్ సార్థక్.. దమ్ముంటే బిగ్‌బాస్ హౌస్‌లోకి వెళ్లమంటూ (వీడియో)
X

దిశ, వెబ్‌డెస్క్: మాజీ బిగ్‌బాస్ కంటెస్టెంట్ అఖిల్ సార్థక్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పని లేదు. ఆయన నిత్యం సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉంటూ బిగ్‌బాస్-7 కంటెస్టెంట్ పల్లవి ప్రశాంత్‌కు సపోర్ట్ చేస్తూ పలు పోస్టులు చేస్తున్నాడు.తాజాగా, అకిల్ తన ఇన్‌స్టాగ్రామ్ ద్వారా తనపై వస్తున్న ట్రోల్స్‌పై స్పందించాడు. ‘‘ నాపై ట్రోల్స్ అందరికీ చాలా థ్యాంక్స్. నాకు ఫ్రీగా పబ్లిసిటీ ఇస్తున్నారు. నా పై నెగిటివ్ కామెంట్స్ చేసే వాళ్ళకి స్పెషల్ థాంక్స్. ఇవన్నీ నేను ఇప్పటికే వీటిని అస్సలు పట్టించుకోను కూడా. ప్రశాంత్ రన్నర్ అయినా, విన్నర్‌గా నిలిచనా సంతోషిస్తా. దానికంటే నాకు సంతోషం ఏమి లేదు. సీజన్-4 ప్రోమోలో తీసుకొచ్చి కొంత మంది కంటెస్టెంట్స్ పీఆర్సీ స్టంట్స్ చేస్తున్నారు. కానీ కొత్తగా ఏదైనా ఆలోచించండి. డిఫరెంట్‌గా ట్రోలింగ్ చేస్తే బాగుంటుంది. నన్ను రెండు సార్లు రన్నర్ అంటున్నారు. అరే మీకు దమ్ముంటే హౌస్‌లోకి వెళ్లి మీ టాలెంట్ చూపించండి. ప్రశాంత్ హౌస్‌లోకి వెళ్లి గేమ్ క్లియర్‌గా ఆడుతున్నాడు. మీ పబ్లిసిటీ మీరు చేసుకోండి. నాకెలాంటి ఇబ్బంది లేదు. అలాగే సీజన్-4 గుర్తు చేసినందుకు మీ అందరికీ మరోసారి థ్యాంక్స్’’ అంటూ వీడియో లో చెప్పుకొచ్చాడు. అది చూసిన నెటిజన్లు అఖిల్‌కు మద్దతుగా నిలుస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed