దుల్కర్‌ సల్మాన్‌‌తో లవ్ ఎఫైర్‌పై స్పందించిన ఐశ్వర్య.. ఇదే ఫస్ట్ ఎక్స్‌పీరియన్స్ అంటూ..

by samatah |   ( Updated:2023-08-18 07:26:19.0  )
దుల్కర్‌ సల్మాన్‌‌తో లవ్ ఎఫైర్‌పై స్పందించిన ఐశ్వర్య.. ఇదే ఫస్ట్ ఎక్స్‌పీరియన్స్ అంటూ..
X

దిశ, సినిమా: ‘కింగ్‌ ఆఫ్‌ కోథా’ మూవీతో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధంగా ఉన్న యంగ్ బ్యూటీ ఐశ్వర్యలక్ష్మీ.. హీరో దుల్కర్ సల్మాన్‌తో తనకున్న రిలేషన్ గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించింది. వీరిద్దరు జంటగా నటించిన పాన్‌ ఇండియా చిత్రం ‘కింగ్ ఆఫ్ కోథా’ ఆగస్టు 24న విడుదలకానుంది. ఈ సందర్భంగా ప్రమోషన్స్‌లో పాల్గొంటున్న ఐశ్వర్య.. ‘ఇంత పెద్ద ప్రాజెక్టులో నటించడం ఇదే మొదటిసారి. ఈ సినిమాలో నేను తార పాత్ర పోషించగా దుల్కర్‌గారు రాజుగా కనిపించనున్నాడు. అయితే మా ఇద్దరి మధ్య అందమైన లవ్‌స్టోరీ ఉంది. ప్రేక్షకులు ఫిదా అవుతారు. మూవీ మొత్తం ఆసక్తికరంగా ఉంటుంది. అంతేకాదు ఈ ప్రేమ కథకు అద్భుతమైన సంగీతం తోడైంది. ఈమూవీ నా కెరీర్‌లో గుర్తిండిపోతుంది. నాకు మంచి పేరు మాత్రమే కాదు అవకాశాలు తెచ్చిపెడుతుందని బలంగా నమ్ముతున్నా’ అని చెప్పింది. చివరగా తనకు ‘దసరా’లో కీర్తి సురేష్ క్యారెక్టర్ బాగా నచ్చిందని, అవకాశం ఉంటే అలాంటి పాత్రలు చేయాలనుకుంటున్నట్లు తెలిపింది.

Read More: మహేష్ బాబు నాకు ఇచ్చిన మొదటి బహుమతి అదే.. నమ్రతా కామెంట్స్ వైరల్

Advertisement

Next Story

Most Viewed