- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Aishwarya Rajesh: గ్లామర్ రోల్స్ పై షాకింగ్ కామెంట్స్ చేసిన ఐశ్వర్య రాజేష్
దిశ, సినిమా: హీరోయిన్ ఐశ్వర్య రాజేష్ మన తెలుగు వారందరికీ సుపరిచితమే. ఈ ముద్దుగుమ్మ తమిళ సినీ ఇండస్ట్రీలో మంచి గుర్తింపు తెచ్చుకుంది. కెరియర్ స్టార్టింగ్లో సహాయ నటిగా నటిస్తూ మెల్లిగా క్రేజ్ తెచ్చుకుని హీరోయిన్ గా తన అదృష్టాన్ని పరీక్షించుకుంది. ఈమె చేసిన సినిమాలు కొన్ని హిట్ గా నిలిచాయి. తెలుగులో కూడా నటించింది కానీ ఇక్కడ సరైన గుర్తింపు రాలేదు.
ప్రస్తుతం కోలీవుడ్ మూవీస్ లో నటిస్తుంది. ఐశ్వర్య ఇప్పటి వరకు గ్లామర్ రోల్స్ నటించలేదు. డీ గ్లామర్ పాత్రలతోనే ఫేమస్ అయింది. అయితే, ఇటీవల ఈ బ్యూటీ ఓ ఇంటర్వ్యూలో గ్లామర్ పాత్రలపై తన మనసులో అభిప్రాయాన్ని అభిమానులతో పంచుకుంది.
ఐశ్వర్య కథలో ఎంచుకునే విషయంలో చాలా ఆలోచిస్తానని చెబుతోంది. " నేను ఏదైనా చేసేటప్పుడు అది ఎప్పటికి గుర్తిండి పోవాలి దాని నుంచి ఎంతో కొంతో నేర్చుకోవాలి అనుకుంటాను. చేసిన పాత్రలే చేయడం నాకు అసలు నచ్చదు. గ్లామర్ కంటే నటనకు ప్రాధాన్యత ఇచ్చేవి మాత్రమే చేయాలనుకుంటాను. సినిమాలు ఎంటర్టైన్ కోసమే కాదు, సమాజానికి కూడా ఉపయోగపడాలి " అని చెప్పుకొచ్చింది.