Aishwarya Rai: ఆరాధ్య ఎప్పటికీ నాతోనే ఉంటుందంటూ ఐశ్వర్య కామెంట్స్.. విడాకులపై క్లారిటీ ఇచ్చినట్టేనా?

by Hamsa |   ( Updated:2024-09-28 08:59:45.0  )
Aishwarya Rai: ఆరాధ్య ఎప్పటికీ నాతోనే ఉంటుందంటూ ఐశ్వర్య కామెంట్స్.. విడాకులపై క్లారిటీ ఇచ్చినట్టేనా?
X

దిశ, సినిమా: బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఐశ్వర్య రాయ్ ఇటీవల ‘పొన్నియన్ సెల్వన్-2’ సినిమాలో కీలక పాత్రలో నటించి మెప్పించింది. ఈ మూవీ విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ అయింది. అయితే ఇందులోని నటనకు గానూ ఐశ్వర్య రాయ్ ఉత్తమ నటిగా 2024 ఐఫా అవార్డు కూడా అందుకుంది. అబుదాబి వేదికగా జరిగిన ఐఫా వేడుకలకు ఐశ్వర్య తన కూతురు ఆరాధ్యతో కలిసి వెళ్ళింది. అయితే ఓ విలేకరి ఆరాధ్య మీతోనే ఉంటూ ఎన్నో విషయాలు నేర్చుకుంటుంది అని ఏదో అడుగుతుండగా.. ఐశ్వర్య అసహనం వ్యక్తం చేస్తూ.. ‘‘తను నా కూతురు. ఎల్లప్పుడూ నాతోనే ఉంటుంది’’ అని రియాక్ట్ అక్కడి నుంచి వెళ్లిపోయినట్లు సమాచారం. ప్రజెంట్ ఐశ్వర్య కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

ఇక ఈ విషయం తెలుసుకున్న నెటిజన్లు ఆమె అభిషేక్ బచ్చన్‌తో విడాకులు తీసుకోబోతున్నట్లు ఈ కామెంట్స్‌తో క్లారిటీ ఇచ్చిందని పలు రకాలుగా చర్చించుకుంటున్నారు. కానీ ఇందులో ఎలాంటి నిజం లేదని ఆమె అభిమానులు వాధిస్తున్నారు. కాగా, ఐశ్వర్య రాయ్ బచ్చన్, అభిషేక్ బచ్చన్ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వీరికి ఆరాధ్య అనే కూతురు కూడా ఉంది. అయితే ఈ జంట విడాకులు తీసుకోబోతున్నారంటూ గత కొద్ది కాలంగా పలు వార్తలు వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. కానీ వీరిద్దరూ వాటిపై అధికారికంగా స్పందించలేదు.

కానీ ఇటీవల తమ కూతురు ఆరాధ్యతో కలిసి వెకేషన్‌కు వెళ్లినట్లు ఓ వీడియో వైరల్ కావడంతో విడాకుల వార్తలు అబద్దమని తేలిపోయింది. అలాగే ‘పారిస్ ఫ్యాషన్ వీక్‌’ వేదికగా ఆమె వెడ్డింగ్ ధరించడంతో విడాకులకు చెక్ పడినట్లు అయింది. అయినప్పటికీ నిత్యం వీరి విడాకులకు సంబంధించిన ఏదో ఒక వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూనే ఉంది. ఈ క్రమంలోనే ఐశ్వర్య తన కూతురు తనతో ఉంటుందని కామెంట్స్ చేయడం హాట్ టాపిక్‌గా మారింది.

Advertisement

Next Story

Most Viewed