- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
Devara Movie: దేవర మూవీలో ఆ పాటను తీసేసారుగా.. ఇక లేనట్టేనా?
దిశ , వెబ్ డెస్క్ : ఎన్టీఆర్ దేవర మూవీ రిలీజ్ అయి అందర్ని అలరిస్తుంది. ఫస్ట్ డే వరల్డ్ వైడ్ గా రూ. 140 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ కలెక్ట్ చేసిందని సమాచారం. అయితే, మూవీ రిలీజ్ అయ్యాక.. ఎన్నో సందేహాలు. మరి వాటన్నిటికీ సమాధానం పార్ట్ 2 లోనే ఉంటుందని అంటున్నారు.
ఇక దేవర మూవీ విడుదలకు ముందు టీజర్, ట్రైలర్స్, పాటలతో సినిమాపై భారీ అంచనాలు పెంచేసింది. ఈ సినిమా స్టోరీ ఒక ఎత్తైతే .. దీనిలోని పాటలు ఇంకో ఎత్తు. ఫ్యాన్స్ కే కాకుండా ప్రేక్షకులకు కూడా మంచి ఊపునిచ్చాయి. అయితే, ఇప్పుడు ఈ మూవీ గురించి ఓ వార్త సోషల్ మీడియాలో తెగ హల్చల్ చేస్తుంది. అదేంటో ఇక్కడ చూద్దాం..
సినిమాలో దావూదీ.. అనే పాట కనిపించ లేదు.. దీంతో ఫ్యాన్స్ నిరాశ చెందుతున్నారు. సినిమా విడుదలకు ముందు దావూదీ.. అనే వీడియోను రిలీజ్ చేయగా ఆడియెన్స్ నుంచి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. దీనిలో ఎన్టీఆర్ స్టెప్స్, జాన్వీ అందాలు ప్రేక్షకులని అలరించాయి. నిడివి ఎక్కువవ్వడం వలన ఈ పాటను తొలగించినట్టు సమాచారం. మరి దావూదీ సాంగ్ ని ఇక చూస్తామా.. లేదో కూడా డౌటే . లేక పార్ట్ 2 లో ఉంటుందేమో చూడాలి.