- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
విరామం తర్వాత మరో సిరీస్‌కు శ్రీకారం చుట్టిన సమంత.. హీరో ఎవరంటే?
దిశ, సినిమా: ‘ఏమాయ చేశావే’ సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన సమంత అందరికీ సుపరిచితమే. తన అందం, అభినయంతో ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు సంపాదించుకున్నది. స్టార్ హీరోలందరి సరసన నటించి స్టార్‌డమ్ క్రియేట్ చేసుకుంది. లేడి ఓరియంటెడ్ మూవీస్‌లో నటిస్తూ స్టార్ హీరోయిన్‌గా ఎదిగింది. అలా కెరీర్ పీక్స్‌లో ఉన్నప్పుడే మయోసైటీస్ అనే వ్యాధి బారిన పడి సినిమాలకు దూరం అయ్యింది. అయితే కొంత కాలం సినిమాలకు దూరం అయిన సమంతా మళ్లీ తెరపై సందడి చేయనుంది. సిటాడెల్ హనీ బన్నీతో తనలోని యాక్షన్ కోణాన్ని రుచి చూపించడానికి సిద్ధమవుతుంది. అలాగే సొంత బ్యానర్ పై ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్ నిర్మాణంలో సమంత కీలక పాత్రధారిగా ‘మా ఇంటి బంగారం’ చిత్రం తీయనుంది.
ఇదిలా ఉంటే తాజాగా సమంతకు సంబంధించిన మరో వార్త నెట్టింట హల్ చల్ చేస్తోంది. అదేంటంటే.. ఇప్పుడామె మరో కొత్త వెబ్‌సిరీస్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇందులో ఆమెతో కలిసి బాలీవుడ్ కథానాయకుడు ఆదిత్య రాయ్ కపూర్ నటిస్తున్నట్లు సమాచారం. ‘‘ది ఫ్యామిలీ మ్యాన్’, ‘సిటాడెల్’ సిరీస్‌ల కోసం రాజ్ అండ్ డీకేలతో కలిసి పని చేసిన సమంత మరోసారి తన రాబోయే ప్రాజెక్టు కోసం వారితో కలిసి పని చేయనుంది. పూర్తి యాక్షన్ నేపథ్యంలో సాగే ఈ సిరీస్‌లో వచ్చే సీక్వెన్స్ కోసం ఇప్పటికే ఆదిత్య, సమంత కసరత్తులు కూడా మొదలుపెట్టారు. దీనికి ‘రక్తబీజ్’ అనే టైటిల్ అనుకున్నట్లు సమాచారం. ఆగస్ట్‌లో చిత్రీకరణ ప్రారంభించనున్నారని సన్నిహితవర్గాల నుంచి సమాచారం. దీంతో సమంత అభిమానులు వెల్‌కమ్ విషెష్ తెలుపుతున్నారు.