Prabhas: 16 ఏళ్ల తర్వాత ప్రభాస్ తో త్రిష.. పెయిర్ వర్కౌట్ అవుతుందా?

by Prasanna |
Prabhas: 16 ఏళ్ల తర్వాత ప్రభాస్ తో త్రిష.. పెయిర్ వర్కౌట్ అవుతుందా?
X

దిశ, సినిమా : యానిమల్ సినిమాతో పెద్ద హిట్ కొట్టిన దర్శకుడు సందీప్ రెడ్డి వంగా తర్వాతి ప్రాజెక్ట్ పాన్ ఇండియా ప్రభాస్‌తో చేయనున్నాడు. దీనికి సంబంధించిన పనులు కూడా మొదలు పెట్టారు. ఈ మూవీకి ‘స్పిరిట్‌’ అనే టైటిల్‌ను పెట్టారు. సందీప్ రెడ్డి వంగ ప్రస్తుతం ఎంపికలో ఫుల్ బిజీ అయ్యారు. అయితే చిత్ర టీం నుంచి అధికారిక ప్రకటన అనౌన్స్ చేయకముందే ఈ మూవీ పై పలు వార్తలు హల్చల్ చేస్తున్నాయి.

ఈ సినిమాలో ప్రభాస్‌కు జోడీగా సీనియర్ హీరోయిన్ త్రిష కృష్ణన్ నటిస్తుందని టాక్ నడుస్తుంది. ఈ ముద్దుగుమ్మ ఇప్పటికీ హీరోయిన్ పాత్రలు చేస్తుంది. రెమ్యునరేషన్ కూడా కోట్లలో తీసుకుంటుంది. దాదాపు స్టార్ హీరోలందరితో జతకట్టింది. ఇప్పుడు ‘స్పిరిట్’ మూవీ కోసం సందీప్ రెడ్డి వంగ త్రిష ను కలిసినట్టు తెలిసిన సమాచారం.

అయితే, దీనిపై మూవీ టీం నుంచి అధికారిక ప్రకటన రావాల్సి. వరుస హిట్స్ తో ప్రభాస్ దూసుకుపోతున్నాడు. అయితే, ఆయన సినిమాల్లో హీరోయిన్ పాత్ర కొంచం నెగిటివ్ కూడా యాడ్ అవుతుందంటూ గుస గుస లు వినిపిస్తున్నాయి. "యానిమల్" మూవీ టైంలో కూడా ప్రతికూలంగా స్పందించారు. మరి త్రిష ఒప్పుకుంటుందా.. లేదనేది చూడాల్సి ఉంది.

Advertisement

Next Story

Most Viewed