స్టార్ హీరోతో ఎఫైర్.. పెళ్లి కాకుండానే ప్రెగ్నెంట్ అయిన హీరోయిన్.. నెట్టింట సంచలనం సృష్టిస్తున్న పోస్ట్

by Disha Web Desk 6 |
స్టార్ హీరోతో ఎఫైర్.. పెళ్లి కాకుండానే ప్రెగ్నెంట్ అయిన హీరోయిన్.. నెట్టింట సంచలనం సృష్టిస్తున్న పోస్ట్
X

దిశ, సినిమా: సినీ ఇండస్ట్రీలో డేటింగ్, రిలేషన్‌షిప్ పెట్టుకోవడం సర్వసాధారణ విషయం అయిపోయింది. నిర్మాతలతో, డైరెక్టర్లతో, హీరోలతో, సినీ తారలు రిలేషన్‌షిప్ నడపడం గత కొద్ది కాలంగా కొనసాగుతుంది. అయితే కొందరు పెళ్లి చేసుకుని తమ బంధాన్ని జీవితకాలం గుర్తుండిపోయేలా చేసుకుంటున్నారు. కానీ మరికొందరు మాత్రం డేటింగ్ చేసి ఏవో కారణాల వల్ల మధ్యలోనే విడిపోతున్నారు. ప్రెగ్నెంట్ అయి పిల్లలు, పుట్టాక విడిపోయిన వారు ఎందరో ఉన్నారు. అయితే ఓ స్టార్ హీరోతో డేటింగ్ చేయడం వల్ల హీరోయిన్ ప్రెగ్నెంట్ అయినట్లు ఓ పోస్ట్ నెట్టింట హల్ చల్ చేస్తుంది.

అసలు విషయంలోకి వెళితే.. బాలీవుడ్ స్టార్ హీరో సంజయ్ దత్, మాధురీ దీక్షిత్ గతంలో ప్రేమించుకున్న ట్లు నెట్టింట పలు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. మానసికంగా, శారీరకంగా దగ్గరై కొద్ది కాలం పాటు వీరిద్దరూ సహజీవనం చేశారట. పెళ్లి కూడా చేసుకోవాలని డిసైడ్ అయ్యారని తెలుస్తోంది. కానీ ఆ తర్వాత సంజయ్ దత్ ఓ కేసులో అరెస్ట్ కావడంతో మాధురీ అతనికి దూరంగా ఉందట. తాజాగా, సంజయ్ దత్‌తో డేటింగ్ చేయడం వల్ల మాధురీ దీక్షిత్ ప్రెగ్నెంట్ అయినట్లు సినీ క్రిటిక్ ఉమైర్ సంధు పోస్ట్ పెట్టడంతో వీరి వ్యవహారం మళ్లీ నెట్టింట వైరల్ అవుతోంది.

ప్రస్తుతం ఈ పోస్ట్ సంచలనం సృష్టిస్తోంది. ఇందులో నిజమెంత అనేది తెలియనప్పటికీ ఈ ట్వీట్ చూసిన వారంతా ఉమైర్ సంధుపై దుమ్మెత్తిపోస్తున్నారు. గతంలో జరిగింది మర్చిపోయి ఫ్యామిలీస్‌తో సంతోషంగా ఉన్న వారిపై ఇలాంటి పోస్ట్ పెట్టడం ఏంటని? ఫైర్ అవుతున్నారు. కాగా, సంజయ్ దత్ మాన్యత అనే అమ్మాయిని పెళ్లి చేసుకుని జీవనం కొనసాగిస్తున్నాడు. ఇక మాధురీ ఓ డాక్టర్‌ను వివాహమాడి సంతోషంగా గడుపుతోంది.



Next Story

Most Viewed