- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
నన్ను తొక్కేయాలని చూశారు.. బాలీవుడ్ ఇండస్ట్రీపై ఆదిత్యరాయ్ షాకింగ్ కామెంట్స్
దిశ, సినిమా: సినిమా ఇండస్ట్రీలో నెపోటిజంపై కొనసాగుతున్న ఇష్యూపై ఆదిత్యరాయ్ కపూర్ తన అభిప్రాయం వెల్లడించాడు. రీసెంట్‌గా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న నటుడు తను ఎదిగిన తీరు, ఇతరుల సపోర్టు గురించి ఓపెన్ అయ్యాడు. ‘నేను ఎవరి మద్ధతు లేకుండానే సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టాను. నా సోదరుల సహకారం కూడా పొందకుండానే సొంత మార్గాన్ని ఎంచుకుని నిలబడ్డాను. చిన్న చిన్న పాత్రలు చేస్తూ ఈ రోజు ఒక స్థాయికి చేరుకున్నాను. కొంతకాలం ఆర్జేగా కూడా పనిచేశా. నేను ఎలా ఎదిగానో, ఎన్ని ఇబ్బందులు పడ్డానో, నా జర్నీ ఎలా కొనసాగిందో, ఎన్ని ఒడిదొడుకులు తట్టుకుని నిలబడ్డానో చాలామందికి స్పష్టంగా తెలుసు. అందరిలాగే నేను ఎన్నో ఆడిషన్స్‌లో పాల్గొని తిరస్కరణకు గురయ్యాను. కానీ ఎన్నడూ డిజప్పాయింట్ కాలేదు. రిజెక్ట్‌ను కామన్‌గానే తీసుకున్నా. అంతేందుకు ఇప్పటికీ పలు ప్రాజెక్టులకోసం ఆడిషన్‌కు వెళతాను. పని వెతుక్కోవడంలో తప్పేమీ లేదని నా అభిప్రాయం’ అంటూ చెప్పుకొచ్చాడు.