ఐయామ్ ఏ రియల్ డఫర్.. నాకు తెలివి లేదని ఒప్పుకుంటా : అదితి రావు హైదరీ

by Vinod kumar |   ( Updated:2023-03-30 13:08:15.0  )
ఐయామ్ ఏ రియల్ డఫర్.. నాకు తెలివి లేదని ఒప్పుకుంటా : అదితి రావు హైదరీ
X

దిశ, సినిమా: అందాల తార అదితి రావు హైదరీ తనను తాను అసమర్థ, తెలివితక్కువ వ్యక్తిగా భావిస్తానంటోంది. ఆమె నటించిన ‘జూబ్లీ’ సిరీస్ అమోజాన్ ప్రైమ్ వేదికగా ఏప్రిల్ 7 నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఈ మేరకు రీసెంట్‌గా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న నటి.. తన కెరీర్, పర్సనల్ లైఫ్ గురించి ఓపెన్ అయింది. నిజ జీవితంలోనూ ‘జూబ్లీ’లో పోషించిన పాత్ర వలె.. తన చుట్టూ ఉన్న ప్రేమ, సంబంధాల ఆధారంగా జీవితంలో నిర్ణయాలు తీసుకుంటానని చెప్పింది. అలాగే ‘ఏదైనా డౌట్ ఉంటే నావైపు చూడండి. ఐ యామ్ ఏ రియల్ డఫర్. ప్రతికూల వాతవరణాల మధ్య కూడా తాను ఒక మంచి విషయాన్ని కనుగొంటాను’ అని తన ప్రత్యేకత గురించి వివరించింది.

ఇవి కూడా చదవండి: నీకు భర్త తప్ప అందరూ కావాలి.. మెగా డాటర్‌పై ట్రోలింగ్

Advertisement

Next Story

Most Viewed