OTT లోకి ‘Adipurush’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే..?

by Anjali |   ( Updated:2023-08-11 06:27:37.0  )
OTT లోకి ‘Adipurush’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే..?
X

దిశ, వెబ్‌డెస్క్: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, కృతి సనన్ జంటగా వచ్చిన సినిమా ‘ఆదిపురుష్’. రామాయణం బ్యాక్ డ్రాప్‌లో రూపొందిన ఈ మూవీకి ఓం రౌత్ దర్శకత్వం వహించాడు. ప్రభాస్ రాఘవగా, కృతి సనన్ జానకిగా కనిపించిన ఈ మూవీ.. భారీ అంచనాల నడుమ ప్రపంచవ్యాప్తంగా జూన్-16న రిలీజ్ అయింది. కానీ, ఆశించిన ఫలితం దక్కకపోవడంతో బాక్సాఫీస్ వద్దా యావరేజ్ టాక్‌తో రూ. 350 కోట్లు మాత్రమే వసూళ్లు రాబట్టింది.

ఇక థియేటర్లలో సందడి చేసిన ‘ఆదిపురుష్’ ఇప్పుడు ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సినిమా డిజిటల్ రైట్స్‌ను అమెజాన్ ప్రైమ్ సొంతం చేసుకోగా.. గత రాత్రి నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. ప్రస్తుతం ఈ సినిమా అమెజాన్‌లో చూడాలంటే అదనంగా రూ. 279 చెల్లించాల్సి ఉంది. అయితే.. వచ్చే వారం నుంచి ఫ్రీ స్ట్రీమింగ్ ఉండే అవకాశం ఉంది.

ఇవి కూడా చదవండి : Rajini Kanth ‘Jailer’ నెంబర్ వన్ మూవీగా రికార్డు.. First Day Collections ఎంతంటే?

Advertisement

Next Story