- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అలాంటి బట్టలేసుకోవద్దని బలవంతం చేయలేదు: ఆదిల్ ఖాన్
దిశ, సినిమా : బాలీవుడ్ నటి రాఖీ సావంత్.. 'రివీలింగ్ క్లాత్స్' ధరించకపోవడంపై ప్రియుడు ఆదిల్ ఖాన్ స్పందించాడు. ప్రస్తుతం రాఖీతో పీకల్లోతూ ప్రేమలో ఉన్న యంగ్ డ్యాన్సర్.. ఆమెను బట్టలేసుకునే పద్ధతి మార్చుకోవాలని ఎప్పుడూ బలవంతం చేయలేదని స్పష్టం చేశాడు. అయితే ఏ విషయమైనా ప్రేమగా చెబితే ఎదుటివారిలో తప్పకుండా మార్పువస్తుందన్న ఆయన.. తన ప్రేమను గౌరవిస్తూ రాఖీ అలాంటి దుస్తులు ధరించడం మానేసిందని, ఆమె సొంత నిర్ణయాలను కూడా తనకోసం మార్చుకోవడం బాగా నచ్చిందని చెప్పాడు.
'డ్రెస్సింగ్ ఆడవాళ్ల అందాన్ని పెంచుతుందనడంలో సందేహం లేదు. కానీ, మతానికుండే విలువలను పాటించాలి. అలాగని ఆమెను హిజాబ్ లేదా బురఖా ధరించమని ఆంక్షలు పెట్టలేదు. బలవంతం చేయలేదు. నా అభిప్రాయం ఆమెకు అర్థమయ్యేలా చేశాను' అంటూ క్లారిటీ ఇచ్చాడు. ఇక అతని అభ్యంతరాల కారణంగానే తాను వేసుకునే దుస్తులను మార్చుకున్నట్లు పలు సందర్భాల్లో రాఖీ చెప్పిన విషయం తెలిసిందే.