Adah Sharma: పెళ్లి కాకుండానే బేబి బంప్‌తో దర్శన మిచ్చిన నితిన్ హీరోయిన్.. షాక్‌లో ఫ్యాన్స్(పోస్ట్)

by Kavitha |   ( Updated:2024-08-20 07:46:58.0  )
Adah Sharma: పెళ్లి కాకుండానే బేబి బంప్‌తో దర్శన మిచ్చిన నితిన్ హీరోయిన్.. షాక్‌లో ఫ్యాన్స్(పోస్ట్)
X

దిశ, సినిమా: ‘హార్ట్ ఎటాక్’ మూవీతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అయిన అదా శర్మ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆ తర్వాత అల్లు అర్జున్ నటించిన సన్ ఆఫ్ సత్యమూర్తి అనే సినిమాలో కూడా నటించింది. అయితే తెలుగులో అనుకున్నంత పాపులారిటీ దక్కలేదు ఈ బ్యూటీకి.. దీంతో బాలీవుడ్ చెక్కేసింది. అలా అక్కడ తన నటనతో మెప్పిస్తూ ఎక్కువగా అవకాశాలు అందిపుచ్చుకుంటూ స్టార్ హీరోయిన్‌గా రాణిస్తుంది. ముఖ్యంగా 'ది కేరళ స్టోరీ' చిత్రం ఆమెకు ఎంతగా గుర్తింపు తెచ్చిపెట్టిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇలా బ్యాక్ టు బ్యాక్ హిట్స్‌తో దూసుపోతున్న ఆదా శర్మ.. ప్రస్తుతం అన్ని భాషల్లో వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉంది. అలాగే సోషల్ మీడియాలో నిత్యం యాక్టీవ్‌గా ఉంటూ తమ అభిమానులకు దగ్గరవుతూ ఉంటుంది. ఈ క్రమంలో ఈమె వీడియో ఒకటి నెట్టింట వైరల్‌గా మారింది.

తాజాగా ఆదా శర్మ ఇన్‌స్టా వేదికగా ఓ వీడియో పోస్ట్ చేసింది. అందులో ఆమె బేబి బంప్‌తో ముఖం నిండా దెబ్బలతో ఉన్నట్టుగా కనిపించింది. అంతే కాకుండా కొన్ని ఎమోజిలు హింట్స్‌గా ఇస్తూ “ఈ మూవీ నేమ్ గెస్ చేయండి.. ఈ సినిమాలోని పరిస్థితులు చాలా ఒత్తిడితో కూడుకున్నవి కాబట్టి, నేను పూర్తిగా పరధ్యానం కాకుండా నా మనసును చెదరగొట్టేలా ఇలా క్రేజీగా బిహేవ్ చేస్తాను” అంటూ క్యాప్షన్ జోడించింది. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారగా.. నెటిజన్లు రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. మరి మీరు ఆ వీడియో పై ఓ లుక్ వేసేయండి.

( video link credits to adah_ki_adah instagram id)

Advertisement

Next Story

Most Viewed