వారైతే ఓకే.. అంకుల్స్‌కు బంఫర్ ఆఫర్ ప్రకటించిన నటి సురేఖ వాణి కుమార్తె..!!

by Anjali |   ( Updated:2024-03-26 09:05:18.0  )
వారైతే ఓకే.. అంకుల్స్‌కు బంఫర్ ఆఫర్ ప్రకటించిన నటి సురేఖ వాణి కుమార్తె..!!
X

దిశ, సినిమా: క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా అగ్ర హీరోల సినిమాల్లో నటించి.. ప్రేక్షకుల మన్ననలు పొందింది నటి సురేఖ వాణి. ప్రస్తుతం ఈమెకు సినిమాల్లో అవకాశాలు తగ్గాయి. అయినప్పటికీ సురేఖ సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉంటోంది. పొట్టి పొట్టి బట్టలు ధరించి, కుమార్తె సుప్రీతతో కలిసి తెగ ఎంజాయ్ చేస్తోంది. తల్లీకూతుర్లు ఒలకబోస్తోన్న గ్లామర్ ఫొటోలను సోషల్ మీడియాలో పంచుకోగా.. బోల్డ్ కామెంట్లతో ముంచెత్తుతున్నారు. అవేమీ పట్టించుకోకుండా సురేఖ తన పని తాను చేసుకుంటూ వెళ్తుంటుంది. ఇక కూమార్తెను సినీ పరిశ్రమకు పంపించాలని ప్లాన్ చేస్తోన్న విషయం తెలిసిందే.

ప్రస్తుతం సుప్రీత కథానాయికగా టాలీవుడ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇస్తోంది. బిగ్ బాస్ రన్నర్ అమర్ దీప్ సరసన ఓ చిత్రంలో నటిస్తోంది. ఇకపోతే తాజాగా సుప్రీత ఓ ఇంటర్వ్యూ కు హాజరై తల్లి రెండో పెళ్లి గురించి చెప్పుకొచ్చింది. ‘‘మా అమ్మకు భర్తగా అంకుల్స్ లాంటి వారైతేనే కరెక్ట్ గా సెట్ అవుతారు. వివాహనంతరం మా అమ్మను బాగా చూసుకోవాలి. మా అమ్మ పట్ల నిర్లక్ష్యం చూపించకూడదు. తనని బాధపెట్టకుండా హ్యాపీగా చూసుకోవాలి. అలాంటి వ్యక్తి దొరికితే మా అమ్మకు వెంటనే మ్యారేజ్ చేసేస్తాను’’ అంటూ సుప్రీత ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. ప్రస్తుతం నటి సురేఖ వాణి కుమార్తె కామెంట్స్ నెట్టింట హాట్ టాపిక్ గా మారాయి.

Advertisement

Next Story