- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
దురదృష్టవశాత్తు నా భర్త గుండెపోటుకు గురయ్యారు.. నటి షాకింగ్ పోస్ట్
దిశ, వెబ్‌డెస్క్: తెలుగు సినీ ప్రేక్షకులకు నటి సనా పరిచయమే. తల్లి పాత్రలు, సహాయ నటి పాత్రలు చేస్తూ తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నది. తెలుగులోనే కాకుండా అన్ని భాషల్లో నటించింది. ముఖ్యంగా తెలుగులో పవన్ కల్యాణ్, మహేష్ బాబు, ప్రభాస్, ఎన్టీఆర్, అల్లు అర్జున్, రామ్ చరణ్ వంటి అగ్ర హీరోల సినిమాల్లో నటించి రాణించింది. సోషల్ మీడియాలోనూ యాక్టీవ్‌గా ఉంటుంది. సినిమాలు, వ్యక్తిగత విషయాలకు సంబంధించిన సమాచారాన్ని ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్, ట్విట్టర్ ద్వారా అభిమానులకు తెలియజేసింది. అయితే, సడన్‌గా కొన్ని రోజులుగా నెట్టింట్లో ఒక్క పోస్టు కూడా పెట్టకుండా సైలెంట్‌గా ఉండిపోయారు. దీంతో ఏమైందని అభిమానుల్లో టెన్షన్ మొదలైంది. ఈ క్రమంలోనే ఆమెకు మెసేజుల వర్షం కురిపించారు. తాజాగా రంజాన్ వేళ ఆమె స్పందించారు. కొన్ని రోజుల క్రితం తనకు భర్తకు గుండెపోటు వచ్చిందని అన్నారు. సకాలంలో గమనించి ఆసుపత్రికి తీసుకెళ్లడంతో గండం తప్పిందని చెప్పుకొచ్చారు. సర్జరీ విజయవంతంగా జరిగి ప్రస్తుతం క్షేమంగా ఉన్నామని అన్నారు. దీంతో సనా భర్త త్వరగా కోలుకోవాలని అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు.