ముసలోడితో పెళ్లికి రెడీ అయిన స్టార్ హీరోయిన్.. ఇదేం పోయేకాలం అంటున్న ఫ్యాన్స్!

by Disha Web Desk 8 |
ముసలోడితో పెళ్లికి రెడీ అయిన స్టార్ హీరోయిన్.. ఇదేం పోయేకాలం అంటున్న ఫ్యాన్స్!
X

దిశ, సినిమా : సీనియర్ నటి ప్రేమ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఏ నాగిని సినిమా చూసినా ఈమె గుర్తు వస్తుంది. అంటే అంతలా తాను నాగదేవత పాత్రలో ఒదిగిపోయింది. దేవి, దేవి అభయం లాంటి చాలా సినిమాల్లో నాగదేవతగా కనిపించి అందరినీ ఆకట్టుకుంది. అయితే చాలా రోజుల తర్వాత ఈ నటికి సంబంధించిన ఓ న్యూస్ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. అది ఏమిటంటే? ప్రేమ ఒక వ్యక్తితో ఉన్న ఫొటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక అందులో నటి పక్కన ఉన్న వ్యక్తి కాస్త ముసలాయనగా ఉన్నాడు. దీంతో ఇది చూసిన నెటిజన్స్ ప్రేమ రెండో పెళ్లి చేసుకుంది. ఈ నటికి ఇదేం పోయే కాలం, పోయి పోయి ముసలోడిని పెళ్లి చేసుకుందని కామెంట్స్ చేస్తున్నారు.





దీంతో ఈ వార్తలపై స్పందించిన నటి, తాను రెండో పెళ్లి చేసుకోలేదని, తన పక్కన ఉన్న వ్యక్తి, కన్నడ టెలివిజన్లో ఎగ్జిక్యూటివ్ గా మంచి పేరుగాంచిన అరవింద్ తన స్నేహితుడని చెప్పుకొచ్చింది. అంతే కాకుండా నచ్చిన వ్యక్తి దొరికితే తప్పకుండా 70 ఏళ్ల వయసులోనైనా పెళ్లి చేసుకుంటాను అని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ నటి చేసిన కామెంట్స్ నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.

Next Story

Most Viewed