‘ఆ రోజు చందు మా ఇంటికి వచ్చాడు’.. కీలక విషయాలు బయటపెట్టిన నటి పవిత్ర కూతురు

by Satheesh |   ( Updated:2024-05-18 13:29:41.0  )
‘ఆ రోజు చందు మా ఇంటికి వచ్చాడు’.. కీలక విషయాలు బయటపెట్టిన నటి పవిత్ర కూతురు
X

దిశ, వెబ్‌డెస్క్: బుల్లితెర నటులు పవిత్ర జయరామ్, చందుల మరణాలు ఇండస్ట్రీలో సంచలనం రేపుతున్నాయి. ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో పవిత్ర మృతి చెందగా.. శుక్రవారం తన నివాసంలో ఉరి వేసుకుని చందు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఒకే సీరియల్‌లో (త్రినయని) కలిసి నటించిన వీరు రోజుల వ్యవధిలోనే మృతి చెందడం పలు అనుమానాలకు తావిస్తోంది. ఇదే సమయంలో పవిత్ర జయరామ్, చందులకు అక్రమ సంబంధం ఉందని.. గత ఆరేండ్లుగా వీరిద్దరూ సహజీవనం చేస్తు్న్నారని జోరుగా ప్రచారం జరుగుతోంది. రోడ్డు ప్రమాదంలో పవిత్ర మృతి చెందడంతో ఆ బాధ తట్టుకోలేక తీవ్ర మనస్థాపానికి గురైన చందు ఆత్మహత్యకు పాల్పడ్డట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

ఈ క్రమంలో చందు, పవిత్రల రిలేషన్‌పై నటి కూతురు ప్రతీక్ష కీలక వ్యాఖ్యలు చేశారు. తన తల్లి పవిత్ర, నటుడు చందు మంచి మిత్రులని.. వారి బంధం గురించి తప్పుగా మాట్లాడవద్దని కోరారు. బయట ప్రచారం జరుగుతున్నట్లుగా వారిద్దరి మధ్య ఎలాంటి చెడు సంబంధం లేదని క్లారిటీ ఇచ్చారు. ఒకే సీరియల్‌లో కలిసి నటించడంతో వారి మధ్య ఫ్రెండ్లీ రిలేషన్ ఉందని స్పష్టం చేసింది. మా అమ్మ అంత్యక్రియలకు కూడా చందు వచ్చారని ప్రతీక్ష వెల్లడించారు. అప్పుడప్పుడు చందు తనతో కూడా ఫోన్‌లో మాట్లాడేవారని, బాగు చదువుకోవాలని నన్ను ప్రోత్సహించేవారని ప్రతీక్ష క్లారిటీ ఇచ్చింది. వారిద్దరి బంధం గురించి అస్సలు తప్పుగా మాట్లాడొద్దని విజ్ఞప్తి చేసింది.

Advertisement

Next Story

Most Viewed