నటి ఆత్మహత్య.. కన్నీళ్లు తెప్పిస్తున్న చివరి వీడియో..!

by sudharani |   ( Updated:2023-04-22 11:24:27.0  )
నటి ఆత్మహత్య.. కన్నీళ్లు తెప్పిస్తున్న చివరి వీడియో..!
X

దిశ, వెబ్‌డెస్క్: గత నెల మార్చి 26న నటి ఆకాంక్ష దూబే ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. భోజ్‌పురీకి చెందిన ఈ నటి.. ‘ముజ్సే షాదీ కరోగి, వీరన్ కే వీర్, ఫైటర్ కింగ్’ వంటి సినిమాలతో గుర్తింపు తెచ్చుకుంది. తర్వాత సమర్ సింగ్ అనే వ్యక్తితో ప్రేమలో పడిన ఆకాంక్ష.. మనస్పర్థాల కారణంగా కొన్నాళ్లకే అతడి నుండి విడిపోయింది. దీంతొ కొంత కాలం డిప్రెషన్‌లో ఉన్న ఆమె.. మళ్లీ కోలుకుని వరుస సినిమాలు చేస్తూ బిజీ లైఫ్ లీడ్ చేస్తుంది.

ఈ క్రమంలోనే ఓ సినిమా షూటింగ్ నిమిత్తం ఉత్తర్ ప్రదేశ్‌లోని వారణాసికి వెళ్లారు. అక్కడ ఓ హోటల్లో బస చేశారు. అక్కడ ఏం జరిగిందో ఏమో తెలియదు కానీ హోటల్ గదిలోనే ఆత్మహత్య చేసుకున్నారు. అయితే.. ఆత్మహత్యకు ముందు ఆమె ఓ సెల్ఫీ వీడియో తీసుకున్నారు. ఆ వీడియోలో ‘‘నాకు ఏదైనా అయితే అందుకు కారణం సమర్ సింగే’’ అంటూ ఎమోషనల్ వీడియో తీసుకున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కాగా.. తన చావుకు కారణం ప్రియుడు సమర్ సింగే అని స్పష్టం చేస్తున్నట్లు తెలుస్తోంది.

Also Read..: బాలీవుడ్ డైరెక్టర్ యష్ చోప్రా భార్య కన్నుమూత!

Advertisement

Next Story