Nivin Pauly: లైంగిక వేధింపులకు గురి చేశాడంటూ నటి ఆరోపణలు.. స్పందించిన ప్రేమమ్ నటుడు (పోస్ట్)

by Hamsa |   ( Updated:2024-09-04 14:33:02.0  )
Nivin Pauly: లైంగిక వేధింపులకు గురి చేశాడంటూ నటి ఆరోపణలు.. స్పందించిన ప్రేమమ్ నటుడు (పోస్ట్)
X

దిశ, సినిమా: గత కొద్ది రోజుల నుంచి మలయాళ ఇండస్ట్రీలో హేమ కమిటీ కుదిపేస్తున్న విషయం తెలిసిందే. ఇందులో పలు సంచలన విషయాలు వెలుగులోకి రావడంతో కాస్టింగ్ కౌచ్‌పై మంటలు రగులుతూనే ఉన్నాయి. మలయాళ ఇండస్ట్రీలో కమిటీ లాగా టాలీవుడ్, కన్నడ చిత్ర పరిశ్రమల్లో కూడా రావాలని స్టార్ హీరోయిన్లు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. అలాగే కొంతమంది ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ జరుగుతున్నట్లు తెలుపుతూ అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తున్నారు. ఈ క్రమంలో.. తాజాగా, ప్రేమమ్ నటుడు నివిన్ పౌలి తనను లైంగిక వేధింపులకు గురి చేశాడంటూ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో సంచలనం సృష్టిస్తోంది. సినిమాల్లో ఆఫర్ ఇస్తానని చెప్పి నవంబర్‌లో దుబాయ్ తీసుకువెళ్లి లైంగిక వేధింపులకు పాల్పడ్డారని ఫిర్యాదులో పేర్కొంది. అయితే ఇందులో నివిన్ అరవ నిందితుడిగా ఉన్నాడు.

ఇక ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెట్టింట దుమారం రేపుతోంది. దీనిపై నివిన్ స్పందిస్తూ ఇన్‌స్టా వేదికగా క్లారిటీ ఇచ్చాడు. ‘‘నేను ఒక అమ్మాయిని అసభ్యంగా ప్రవర్థించానంటూ తప్పుడు వార్తలు వస్తున్నాయి. అవి పూర్తిగా అవాస్తమని దయచేసి తెలుసుకోండి. ఈ ఆరోపణలు ఆధారం లేనివి కాబట్టి నేను నిరూపించుకోవడానికి ఎంతకైనా తెలించాలని నిర్ణయించుకున్నాను. ఆ బాధ్యతలను వెలుగులోకి తీసుకురావడానికి అవసరమైన అన్ని చర్చలు తీసుకుంటాను. మీ ఆందోళనకు ధన్యవాదాలు. మిగిలిన వాటిని చట్టబద్ధంగా నిర్వహించి న్యాయంగా పోరాడుతాను’’ అని రాసుకొచ్చాడు. కాగా, నివిన్ పౌలి ప్రేమమ్ సినిమాతో ఫుల్ క్రేజ్ తెచ్చుకున్నాడు. ప్రజెంట్ పలు సినిమాల్లో నటిస్తూ హీరోగా ఇండస్ట్రీలో కొనసాగుతున్నాడు.

Advertisement

Next Story

Most Viewed