మా సినిమా నాకే నచ్చలేదు.. ఆదిపురుష్‌పై నటుడు షాకింగ్ కామెంట్స్

by sudharani |   ( Updated:2023-06-29 09:17:52.0  )
మా సినిమా నాకే నచ్చలేదు.. ఆదిపురుష్‌పై నటుడు షాకింగ్ కామెంట్స్
X

దిశ, వెబ్‌డెస్క్: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ రామునిగా వచ్చిన తాజా సినిమా ‘ఆదిపురుష్’. ఓం రౌత్ దర్శకత్వం వహించిన ఈ మూవీ.. విదులైన నాటి నుంచి ఎన్నో విమర్శలు ఎదుర్కొంది. రామాయణం బ్యాక్ డ్రాప్‌లో ఈ మూవీ నిర్మితమవ్వడంతో..అందులో పాత్రలు, సన్నివేశాలు, డైలాగులు ఇష్టం వచ్చినట్లు మార్చేసి తీశారని నెటిజన్లు మండిపడ్డారు. ఈ క్రమంలోనే ‘ఆదిపురుష్’ సినిమాపై మరోసారి విమర్శలు గుప్పుమంటున్నాయి. సినిమాలో కుంభకర్ణ పాత్ర చేసిన వ్యక్తే ఆ మూవీ గురించి కామెంట్స్ చేయడం చర్చనియాంశంగా మారింది.

కుంభకర్ణ లావీపజ్నీ మీడియాతో మాట్లాడుతూ.. ‘‘ఆదిపురుష్’ షూటింగ్ చేసినప్పుడు ఇన్ని విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తుందని అప్పుడు ఎవరు అనుకోలేదు. సినిమా నుంచి వివాదాస్పదమైన డైలాగులు తొలిగించినప్పటికీ ఒక హిందువుగా ఆ డైలాగ్స్ విషయంలో నేను కూడా బాధపడ్డాను. ఈ మూవీలో నా పాత్ర కొద్ది సేపే ఉంటుంది. నేను నటించిన చిత్రం అయినప్పటికీ కొన్ని విషయాల్లో నాకు కూడా ఈ మూవీ నచ్చలేదు’’ అంటూ చెప్పుకొచ్చాడు. కాగా.. ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

Read More: Samantha: బ్రా లేకుండా రెచ్చిపోయిన సమంత.. మొత్తం విప్పేసిందిగా?

Advertisement

Next Story