ఆ పెద్దాయన కారణంగానే చిరంజీవికి, ఎన్టీఆర్‌కు నేను దూరమయ్యా.. నటుడు షాకింగ్ కామెంట్స్

by sudharani |   ( Updated:2023-07-04 06:11:22.0  )
ఆ పెద్దాయన కారణంగానే చిరంజీవికి, ఎన్టీఆర్‌కు నేను దూరమయ్యా.. నటుడు షాకింగ్ కామెంట్స్
X

దిశ, వెబ్‌డెస్క్: నటుడు శివాజీ గురించి అందరకీ తెలిసిందే. హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా ఎన్నో సినిమాల్లో నటించిన ఆయన.. అప్పట్లో బిజీ హీరోగా ఉండేవాడు. మంచి స్టార్ స్టేటస్‌ని సొంతం చేసుకున్న శివాజీ.. తర్వాత సినిమాలకు దూరం అయ్యారు. సోషల్ వర్క్, రాజకీయాలపై ఫోకస్ పెట్టారు. ఇప్పుడు మళ్లీ నటుడుగా సెకండ్ విన్నింగ్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారు శివాజీ. ఈ క్రమంలోనే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన ఇండస్ట్రీలో ఆర్టిస్టుల గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

ఇండస్ట్రీలో ప్రముఖ ఆర్టిస్టుల కారణంగా నేను చాలా సార్లు అవమానాలు ఎదుర్కొన్నాను. ఓ పెద్దాయన అయితే తండ్రి చనిపోయిన బాధలో ఉన్నారని ఓదార్చడం కోసం ఆయన్ని హగ్ చేసుకోవాలని వెళ్లగా తన రెండు చేతులు పక్కకు తీసేశారని చెప్పారు. అంటే వాళ్లను టచ్ చేయాలంటే హోదా ఉండాలనేది అర్థమయిందన్నారు. అంతే కాదు.. మొదట్లో నేను చిరంజీవికి, ఎన్టీఆర్‌కు చాలా క్లోజ్‌గా ఉండేవాడిని. వారి దగ్గర నా గురించి ఏవేవో చెప్పి వాళ్లకు నాకు దూరం పెంచారని చెప్పుకొచ్చారు.

ఇండస్ట్రీకి వచ్చిన అతి తక్కువ కాలంలోనే తనకు ఎక్కువ రెమ్యునరేషన్ ఇస్తున్నారని జెలసీగా ఫీలైన అతడు.. ఓర్వలేక నిర్మాతలకు లేనిపోనివి చెప్పి రెమ్యునరేషన్ తగ్గించేవాడని శివాజీ వాపోయారు. అతను దైవం, ఆధ్యాత్మిక సమావేశాలకు హాజరవుతుంటారని, గొప్పగొప్ప మాటలు చెబుతుంటారని వాపోయారు. జీవితం చాలా చిన్నది ఎందుకింత భేదాలంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన గురించి హింట్ ఇస్తూ.. ఇవన్నీ అతనికి అర్థం కావాలనే శివాజీ చెప్పడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. కాగా.. శివాజీ వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

Read More: విజయ్ ‘లియో’లో చరణ్ కూడా ఉన్నాడా? ఇక తర్వాత జరిగేది ఏంటంటే

Advertisement

Next Story