- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
బిగ్ షాక్ : విడాకులు తీసుకున్న ఐశ్వర్య రాయ్, అభిషేక్ బచ్చన్.. పోస్ట్‌తో క్లారిటీ!
దిశ, సినిమా : అభిషేక్ బచ్చన్, ఐశ్వర్య రాయ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. వీరు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. అయితే గత కొన్ని రోజుల నుంచి వీరు విడాకులు తీసుకొని విడిపోతున్నారంటూ, అనేక రూమర్స్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా అనంత్ అంబానీ పెళ్లిలో ఐశ్వర్య రాయ్ తన కూతురు ఆరాధ్యతో కనిపించడంతో ఈ రూమర్స్ మరింత ఎక్కువ అయ్యాయి. ఈ క్రమంలోనే విడాకుల రూమర్స్ మధ్య అభిషేక్ బచ్చన్ విడాకులకు సంబంధించిన పోస్టు పై స్పందించడంతో కొందరు నిజంగానే ఐశ్వర్య రాయ్, అభిషేక్ బచ్చన్ విడిపోతున్నారు, దానికి క్లారిటీ ఇదే అంటూ ఈ వార్తను సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
అసలు విషయంలోకి వెళ్లితే.. ఇన్‌స్టా గ్రామ్‌లో గ్రే డైవోర్స్ కు సంబంధిచిన ఓ పోస్టును అభిషేక్ బచ్చన్ లైక్ చేశారు. పోస్టులో ఏమున్నదంటే? విడాకులు ఎవరికీ అంత సులభం కాదు, వృద్ధ దంపతులు వీధి దాటుతున్నప్పుడు చేతులు పట్టుకొని ఉన్న వీడియోలు మన మనసును కదిలిస్తాయి. కొంత మంది అలాంటి కలలు కనేవారు. కానీ ప్రస్తుతం చాలా మంది కపుల్స్ విడిపోతున్నారు. చిన్న చిన్న విషయాల వలన వారు తమ బంధాన్ని వదులుకోవడానికి కూడా సిద్ధపడుతున్నారు.
విడాకులు తీసుకోవడానికి వారిని ఏది ప్రేరేపిస్తుంది. వారు ఎలాంటి సవాళ్లు ఎదుర్కొంటున్నారు వంటి ప్రశ్నలు, సమాధానాలు ఇందులో ఉన్నాయి. ఇక అసలు గ్రే విడాకులు అంటే ? సాధారణంగా 50 ఏళ్లు కలిసి ఉండి, తర్వాత వివాహం రద్దు చేసుకొని విడాకులు తీసుకోవాలనుకునే వారు, వారికి సంబంధించిన నిబంధనలు, వారు విడాకులు తీసుకోవడానికి గల కారణాల అంశాలు ఈ పోస్టులో పొందుపరిచి ఉన్నాయి. కాగా, ఈ పోస్టును అభిషేక్ బచ్చన్ లైక్ చేయడంతో విడాకుల రూమర్స్‌కు ఆజ్యం పోసినట్లైంది. దీంతో నిజంగానే అభిషేక్ బచ్చన్, ఐశ్వర్యరాయ్ విడాకులు తీసుకున్నారు, దానికి క్లారిటీ ఇదే అంటూ కొందరూ ప్రచారం చేస్తున్నారు.
Video credits to heenakhandlwal instagram channel