- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఐశ్వర్యరాయ్‌తో విడాకులు.. నావల్ల కాదంటూ క్లారిటీ ఇచ్చేసిన అభిషేక్ బచ్చన్!
దిశ, సినిమా : బాలీవుడ్ స్టార్ కపుల్ ఐశ్యర్యారాయ్ - అభిషేక్ బచ్చన్ విడాకులు తీసుకుంటున్నారని గత కొన్నిరోజులుగా వార్తలు వినిపిస్తున్నాయి. దీనిపై బచ్చన్ ఫ్యామిలీ రియాక్ట్ కాకపోవడం, అంతలోనే బిగ్ బీ కూడా తన కోడలు ఐశ్యర్యా రాయ్‌ను సోషల్ మీడియాలో అన్ ఫాలో చేయడం అభిమానుల్లో మరిన్ని అనుమానాలకు ఆజ్యం పోసింది. దీంతో పలువురు ఐశ్యర్య, అభిషేక్ నిజంగానే డివోర్స్ తీసుకుంటారని నిర్ధారణకు వచ్చేశారు.
అయితే తాజగా తమ డివోర్స్ వార్తలపై రియాక్ట్ అయిన అభిషేక్ బచ్చన్.. ‘అవును మేం విడాకులు తీసుకుంటున్నాం.. ఈ విషయం మీరు చెప్పినందుకు థ్యాంక్స్. నెక్ట్స్ మేము ఎవరిని చేసుకోబోయేది కూడా మీరే చెప్పండి’ అంటూ వెటకారంగానే సీరియస్ అయ్యాడు అభిషేక్. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ‘‘లైఫ్‌లో ఎలా బతకాలి.. ఎలా ముందుకు వెళ్లాలో మాకు తెలుసు. మూడో వ్యక్తి మా జీవితం గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు. మా మధ్య ఎంత ప్రేమ ఉందో మాకే మాకు తెలుసు. మీకు చెప్పాల్సిన అవసరం లేదు’’ అని చెప్పుకొచ్చాడు. అంతేకాకుండా నా పర్సనల్ లైఫ్ నాకు ఉంటుంది. విడాకుల రూమర్స్‌పై ప్రతీసారి స్పందించడం నావల్ల కాదంటూ విడాకులు తీసుకోవడం లేదని క్లారిటీ ఇచ్చేశాడు అభిషేక్ బచ్చన్. కాగా ఈ బాలీవుడ్ జంట 2007లో లవ్ మ్యారేజ్ చేసుకోగా వీరికిప్పుడు ఆరాధ్య అనే ఓ పాప కూడా ఉంది.