- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఆప్ ఎంపీతో స్టార్ హీరోయిన్ పెళ్లి?
దిశ, వెబ్ డెస్క్: పంజాబ్ కు చెందిన ఆప్ యువ ఎంపీ రాఘవ్ చద్దా.. బాలీవుడ్ బ్యూటీ పరిణితి చోప్రా త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే ఈ ప్రచారంలో ఎంతోకొంత నిజం లేకపోలేదు. ఆప్ ఎంపీ రాఘవ్ చద్ధా.. యాక్ట్రెస్ పరిణితి చోప్రా రిలేషన్ గురించి ఇటీవల చాలా వార్తలు వచ్చాయి. వారిద్దరూ కలిసి పార్టీలకు హాజరైన వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ నేపథ్యంలోనే వారిద్దరి మధ్య ఏదో నడుస్తోందనే ప్రచారం జోరుగా సాగింది. ఈ క్రమంలోనే వారి మధ్య లవ్ ట్రాక్ నడుస్తోందని, త్వరలోనే పెళ్లి కూడా చేసుకోబోతున్నారని బాలీవుడ్ కోడై కూసింది. కానీ అదేమీ నిజం కాదంటూ వారిద్దరూ ఖండిస్తూ వచ్చారు.
కానీ తాజాగా ఆప్ ఎంపీ సంజీవ్ అరోరా ఈ జంట గురించి తన ట్విట్టర్ లో ఓ ఇంట్రెస్టింగ్ కామెంట్ చేశారు. ‘‘ రాఘవ్ చద్దా, పరిణితి చోప్రాలకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు. వారిద్దరి కలయిక ప్రేమ, ఆనందం, స్నేహంతో కలకాలం కొనసాగాలని ఆశిస్తున్నా. మై బెస్ట్ విషెస్’’ అంటూ ట్వీట్ చేశారు. దీంతో త్వరలోనే ఈ జంట పెళ్లి ద్వారా ఒక్కటవుతున్నారనే ప్రచారం జరుగుతోంది. ఇక ఈ జంటపై ట్విట్టర్ లో శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ‘రాఘవ్ చద్దా, పరిణితి జంట చూడముచ్చటగా ఉంది.. కంగ్రాట్స్ బోత్ ఆఫ్ యూ’ అని ఓ నెటిజన్ కామెంట్ చేయగా.. ‘‘మొత్తానికి రూమర్స్ ను నిజం చేశారు ’’ అంటూ మరొకరు ఫన్నీగా కామెంట్ చేశారు