Aadujeevitham : ఓటీటీలోకి ‘ఆడు జీవితం’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే..?

by Disha Web Desk 7 |
Aadujeevitham : ఓటీటీలోకి ‘ఆడు జీవితం’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే..?
X

దిశ, సినిమా: మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ నటించిన తాజా చిత్రం ‘ది గోట్ లైఫ్’. ఈ మూవీని తెలుగులో ‘ఆడు జీవితం’ అనే టైటిల్‌తో రిలీజ్ చేశారు. బ్లెస్సీ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో అమలాపాల్, కేఆర్ గోకుల్, జిమ్మీ జీన్ లూయిస్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. ట్రైలర్‌తోనే ఫుల్ క్రేజ్ తెచ్చుకున్న ఈ చిత్రం.. భారీ అంచనాల మధ్య మార్చి 28న రిలీజై బ్లాక్ బస్టర్ హిట్ సొంతం చేసుకుంది.

అంతే కాకుండా కేవలం 25 రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ. 150 కోట్లు రాబట్టి స్పెషల్ రికార్డ్‌ను క్రియేట్ చేసింది. అయితే.. ఇంతటి విజయం సాధించిన ఈ చిత్రం ఇప్పుడు ఓటీటీ రిలీజ్‌కు సిద్ధం అయినట్లు తెలుస్తోంది. ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే మే 10 నుంచి ‘ఆడు జీవితం’ ఇందులో స్ట్రీమింగ్ కానున్నట్లు సమాచారం. అయితే.. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.



Next Story

Most Viewed