- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
నేను Saidharam Tej ను కలవాలి.. Pawan Kalyan ఇంటి ముందు woman హల్‌చల్
దిశ, డైనమిక్ బ్యూరో : 'నేను హీరో సాయిధరమ్ తేజ్‌ను కలవాలి' అంటూ ఓ మహిళ మరో హీరో ఇంటి ముందు హంగామా సృష్టించింది. హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని హీరో పవణ్ కళ్యాణ్ ఇంటి ముందు గురువారం ఓ మహిళ హల్‌చల్ చేసింది. తమిళనాడులోని మధురై ప్రాంతానికి చెందిన జోసి కమల (36) అనే మహిళ కొంత కాలంగా సాయిధరమ్ తేజ్‌ను కలవాలని ఆందోళన చేస్తుంది. ఈ నేపథ్యంలో జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే కాలనీలో హీరో సాయిధరమ్ తేజ్ ఇంటి వద్దకు తరచూ వస్తోంది. సాయిధరమ్ తేజ్‌ను కలవాలని, ఆయనతో మాట్లాడాలని ఇంటి ఎదుట బైఠాయించి హంగామా చేస్తుంది. గతంలో పలుమార్లు ఇదే విధంగా చేయగా... జూబ్లీహిల్స్ పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకొన్నారు. తర్వాత వారి కుటుంబ సభ్యులకు సమాచారం అందించి సంబంధీకులకు అప్పజెప్పారు.
అయితే, తాజాగా సాయిధరమ్ తేజ్, పవన్ ఇంటికి వెళ్లిన విషయం తెలుసుకుని నేరుగా అక్కడికి వెళ్లి ఇంటి ముందు బైఠాయించింది. దీంతో, పవన్ కల్యాణ్ సెక్యూరిటీ సిబ్బంది పోలీసులకు సమాచారం అందించడంతో... అక్కడికి చేరుకొని వారు మహిళను అదుపులోకి తీసుకున్నారు. ఆమె మానసిక స్థితి సరిగాలేదని గుర్తించారు. మహిళను కోర్టులో హాజరుపరిచి మెంటల్ హాస్పిటల్‌కు తరలించేందుకు కోర్టు అనుమతి కోరుతామని జూబ్లీహిల్స్ పోలీసులు తెలిపారు.
ఇవి కూడా చదవండి:
1.అమితాబ్ మనువడితో షారుఖ్ కూతురు డేటింగ్.. అంగీకరించిన శ్వేతా బచ్చన్?
2.Balakrishna Tweet: ఈ గ్రౌండ్‌లోనే 'వీరసింహారెడ్డి' ప్రీరిలీజ్ ఈవెంట్