ఓ సూపర్ స్టార్ కూతురు ఇప్పుడు రిచ్చెస్ట్ హీరోయిన్.. ఆమె ఆస్తి విలువ ఎంతంటే..

by Javid Pasha |
ఓ సూపర్ స్టార్ కూతురు ఇప్పుడు రిచ్చెస్ట్ హీరోయిన్.. ఆమె ఆస్తి విలువ ఎంతంటే..
X

దిశ, సినిమా : బాలీవుడ్ స్టార్స్ అంటేనే జనంలో అదో క్రేజీ. సినిమాల పరంగానే కాకుండా పర్సనల్ అండ్ ఫ్యామిలీ పరంగానూ వీరి గురించిన పలు ఇంట్రెస్టింగ్ విషయాలు నెట్టింట హల్ చల్ చేస్తుంటాయి. ఇక వారి పిల్లల గురించి అయితే చెప్పాల్సిన అవసరం లేదు. సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టినా, పెట్టకపోయినా వారికి అభిమానులు, ఫాలోవర్స్ ఆటోమేటిగ్గా పెరిగిపోతుంటారు. పేరంటల్ ఫేమ్ ఇందుకు హెల్ప్ అవుతుంది. అలాంటి వారిలో బాలీవుడ్ నటుడు అనిల్ కపూర్ కూతురు సోనమ్ కపూర్ ఒకరు. ఇండస్ట్రీకి పరిచయం కాకముందే ఈమెకు సినీ ప్రేక్షకుల్లో చాలామంది అభిమానులు ఉండేవారు. ఇప్పుడు ఆ రేంజ్ మరింత పెరిగిపోయింది.

అతికొద్ది సమయంలోనే స్టార్ హీరోలతో సినిమాలు చేసి మంచి ఫేమస్ సంపాదించుకుంది సోనమ్ కపూర్. ఇక ఆమె పర్సనల్ విషయాలకు వస్తే ప్రేమ వివాహం చేసుకున్న ఈమె ఓ బిడ్డకు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే. జూన్ 9న తన 39 పుట్టిన రోజును కూడా ఘనంగా జరుపుకుంది. కాగా సోనమ్ ఇటీవల సినిమాలకు దూరంగా ఉంటోంది. తన బిడ్డతోనే సమయం ఎక్కువగా గడుపుతోందట. ప్రస్తుతం మూవీస్ చేయకపోయినా సోషల్ మీడియాలో మాత్రం యాక్టివ్‌గా ఉంటోంది.

ఈ సందర్భంగా సోనమ్ కపూర్ గురించి ఓ ఆసక్తికరమైన వార్త వైరల్ అవుతోంది. ఏంటంటే.. ఈ మధ్య ఆమె సినిమాల్లో ఎక్కువగా కనిపించకపోయినా ఆస్తులు, సంపాదనలో మాత్రం వెనకబడట్లేదట. పైగా కోట్ల రూపాయల సంపాదనతో రిచ్చెస్ట్ హీరోయిన్‌గా ఉంది. వైరల్ అవుతున్న సమాచారం ప్రకారం సోనమ్ ఏడాదికి రూ. 12 కోట్లు సంపాదిస్తుందట. సినిమాలే కాకుండా బ్రాండ్ ఎండార్స్‌మెంట్ ద్వారా కూడా సోనమ్ ఫుల్లుగా సంపాదించడంతో ప్రస్తుతం ఆమె టోటల్ ఆస్తి విలువ రూ. 4 వేలకోట్లుగా ఉంది.

Advertisement

Next Story

Most Viewed