PAWAN KALYAN: పవన్ కల్యాణ్ జీవిత చరిత్రపై అదిరిపోయే స్కిట్.. ఒక్కసారిగా ఎమోషనలైన మెగా డాటర్(వీడియో)

by Anjali |
PAWAN KALYAN: పవన్ కల్యాణ్ జీవిత చరిత్రపై అదిరిపోయే స్కిట్.. ఒక్కసారిగా ఎమోషనలైన మెగా డాటర్(వీడియో)
X

దిశ, సినిమా: జీవితంలో ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొన్న అగ్ర నటుడ్, ఏపీ డిప్యూటీ సీఎం పవర్ స్టార్ పవన్ కల్యాణ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అక్కర్లేదు. ఎన్నో అపజయాల తర్వాత ఈయన ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఘన విజయం సాధించారు. ప్రస్తుతం ఏపీ డిప్యూటీ సీఎం హోదాలో ఉన్నారు. పవన్ ఇన్నేళ్ల అనంతరం ఊహించని విధంగా విజయం సాధించి, ఒక్కసారిగా రికార్డు క్రియేట్ చేయడంతో మెగా ఫ్యామిలీ అండ్ అభిమానులు చాలా ఎమోషనల్ అయిపోయారు.పవర్ స్టార్‌ను విమర్శించిన వారే నేడు చేతులేత్తి దండం పెట్టాల్సిన పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం ఈ హీరో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం పాలనపై ఫోకస్ పెట్టారు. ఎన్నికలకు ముందు ప్రారంభించిన షూటింగ్ జోలికి కూడా వెళ్లకుండా ప్రజల కోసం పాటుపడుతున్నారు. ఇకపోతే పవన్ కల్యాణ్ జీవిత్ర చరిత్రపై వేసిన ఓ స్కిట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

తాజాగా ‘డ్రామా జూనియర్స్‌’ షో లో పవర్ స్టార్ జీవితంపై పిల్లలు ‘రైజ్ ఆఫ్ పవన్ కల్యాణ్’ అనే పేరుతో స్కిట్ అదరగొట్టారు. ఈ స్కిట్ మెగాస్టార్ చిరంజీవితో స్టార్ట్ చేశారు. పవన్ కల్యాణ్ సినీ ఇండస్ట్రీకి ఎలా ఎంట్రీ ఇచ్చాడని, మెగాస్టార్ సతీమణి పవన్‌ను హీరో నువ్వు హీరో కావాలని ఎంకరేజ్ చేయడం, మూవీస్ ఫ్లాప్ అయినప్పుడు నాగబాబు ఎలా సపోర్ట్ చేసేవారో, పవన్ కల్యాణ్ పాలిటిక్స్‌లోకి ఎలా వచ్చారు, ఎలా ఇంతటి ఘన విజయం సాధించారు, గెలుపొందిన అనంతరం ఇంటికి వెళ్లిన తర్వాత ఫ్యామిలీ అంతా ఎలా ఎమోషనల్ అయ్యింది? అనే సన్నివేశాల్ని పిల్లలు అద్భుతంగా చూపించారు. ఈ షో కు మెగా డాటర్ నిహారిక గెస్ట్‌గా హాజరైంది. స్కిట్ చూసిన నిహారిక ఒక్కసారిగా ఎమోషనల్ అయ్యింది. ప్రస్తుతం ఈ స్కిట్ సోషల్ మీడియాలో వైరల్ అవ్వగా.. పవర్ స్టార్ ఫ్యాన్స్ పిల్లలపై పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు.



Advertisement

Next Story

Most Viewed