యువ నటికి షాక్.. ఆ వయసులోనూ మరో బిడ్డకు జన్మనిచ్చిన తల్లి

by Anjali |   ( Updated:2023-03-22 15:49:14.0  )
యువ నటికి షాక్.. ఆ వయసులోనూ మరో బిడ్డకు జన్మనిచ్చిన తల్లి
X

దిశ, వెబ్‌డెస్క్: మలయాళీ బుల్లితెర నటి ‘ఆర్య పార్వతి’ టీవీ సీరియల్స్ లో నటిస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. తాజాగా నెటిజన్లకు ఆమె షాక్‌ ఇచ్చింది. తన తల్లి గర్భం దాల్చిందని స్వయంగా తానే సోషల్ మీడియాతో పంచుకుంది. పార్వతి తల్లి వయస్సు ప్రస్తుతం 47 సంవత్సరాలు ఉంటుంది. ఈ విషయ విన్న నెటిజన్లు అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఇటీవలే పండంటి ఆడబిడ్డ కూడా పుట్టింది. పార్వతి ఈ విషాయాన్ని తెలియజేస్తూ....

‘‘మా అమ్మకి 8వ నెల వచ్చేవరకు నాకు ఈ సంగతి తెలియదు. మరొక ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే నా తల్లిదండ్రులకు కూడా ఈ సంగతి 7వ నెలలోనే తెలిసింది. నేను జన్మించాక, మా అమ్మకి గర్భాశయంలో ఏదో సమస్య ఉండటం మళ్లీ గర్భం దాల్చే అవకాశాలు లేవని డాక్టర్లు చెప్పారట. నాకు ఇప్పుడు 23 ఏళ్లు, అందువల్ల ఈ విషయం గురించి మా నాన్న నాకు చెప్పినప్పుడు ఏం మాట్లాడాలో అర్థం కాలేదు.ఈ వార్త విన్న సమాజం ఎలా తీసుకుంటుందో తెలియదని, మా నాన్న మొదట్లో భయపడ్డారు. మా అమ్మ గర్భం దాల్చినపుడు ఆ సమయంలో నేను ఇంట్లో లేను. ఇంటికి రాగానే అమ్మని పట్టుకుని ఏడ్చేశాను. కానీ నేను ఎందుకు ఏడవాలి అంటూ నాకు నేనే సర్ధి చెప్పుకున్నాను. నా చిన్నప్పుడు నాకు ఒక చెల్లి ఉంటే బావుండేదని అనుకున్నా. ప్రస్తుతం ఆ కోరిక తీరింది. ఇప్పుడు నాకు తోడుగా బుజ్జి చెల్లి వచ్చింది. మా అమ్మ, చెల్లి ఇద్దరి బాధ్యతల్ని నేనే తీసుకుంటున్నాను’’అంటూ ఆర్య పార్వతి ఈ విషయం గురించి సోషల్ మీడియాలో సంతోషంగా తెలిపారు. ఈ సంగతి తెలుసుకున్న నెటిజన్లు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

ఇవి కూడా చదవండి:

ప్రెస్ మీట్‌లో కన్నీళ్లు పెట్లుకున్న అనసూయ.. ఈ సారి ఏమైంది..?

Advertisement

Next Story