Bigg Boss : బిగ్ బాస్ హౌస్‌లో లైవ్‌లో శృంగార వీడియో వైరల్.. మండిపడుతున్న నెటిజన్స్!

by Jakkula Samataha |
Bigg Boss : బిగ్ బాస్ హౌస్‌లో లైవ్‌లో శృంగార వీడియో వైరల్.. మండిపడుతున్న నెటిజన్స్!
X

దిశ, సినిమా : బిగ్ బాస్ ఓటీటీ 3 రియాలిటీ షోపై ప్రముఖులు మండిపడుతున్నారు. ఈ షో మొదలైనప్పటి నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అన్నింటినీ దాటుకుంటూ ఈ షో కంటిన్యూ అవుతుంది. కాగా, తాజాగా ఈ షో నుంచి ఓ వీడియో లీక్ అవ్వడంతో అది సంచలనంగా మారింది. బిగ్ బాస్ హౌస్‌లో ఓ జంట శృంగారంలో పాల్గొన్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీనిపై పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా శివసేన ఎమ్మెల్యే మనీషా.. వీడియోపై స్పందిస్తూ.. బిగ్ బాస్ దారుణమైన షో, అంతా అశ్లీలతను చూపిస్తున్నారు. దాన్ని నిషేధించాలని, షో పై ముంబై పోలీసులు చర్యలు తీసుకోవాలని ఆమె కోరుతున్నారు.

అసలు ఏం జరిగిందంటే?.. బిగ్ బాస్ ఓటీటీ3లో కంటెస్టెంట్ అర్మాన్ మాలిక్, రెండు పెళ్లీలు చేసుకున్నాను అని ఓపెన్‌గా చెప్పడమే కాకుండా, ఆఇ ఇద్దరితో షోకి కూడా వెళ్లిన విషయం తెలిసిందే. అయితే ఆయన మొదటి భార్య పాయల్ మాలిక్ ఇప్పటికే ఇంటికి వెళ్లగా, రెండో భార్య కృతికా మాలిక్ మాత్రం ఇప్పటికీ హౌస్‌లోనే ఉంది. కాగా, తాజాగా ఈ షోలో అర్మాన్ తన రెండో భార్యతో రాత్రి 12.30 గంటల సమయంలో సె**లో పాల్గొన్నట్లు ఓ వీడియో వైర్ అవుతోంది. దీంతో ఈ వీడియోను చూసినవారందరూ షోపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బిగ్ బాస్‌ను నిషేదించాలంటూ కామెంట్స్ చేస్తున్నారు.

ఇక దీనిపై అర్మాన్ మాలిక్ మొదటి భార్య పాయల్ మాలిక్ స్పందిస్తూ.. అది ఫేక్ వీడియో, బిగ్ బాస్ హౌస్‌లో నేను ఉండి వచ్చాను, హౌస్‌లో అలాంటి లైటింగ్ లేదు, దుప్పట అది కానే కాదు, ఎవరో కావాలనే వీడియో క్రియేట్ చేసి, వైరల్ చేస్తున్నారు. అది ఫేక్ వీడియో అని తెలుస్తుంది అంటూ పేర్కొన్నారు.

Advertisement

Next Story